రాంగ్ సైడ్‌లో రైడ్ : నన్నే ఓవర్ టేక్ చేస్తావా.. బైకిస్టును జాడిచ్చి తన్నిన ఒంటె! 

రోడ్డు మీద ఒంటెల గుంపు వెళ్తోంది. వాహనాలు వెళ్లేందుకు కొంచెం కూడా గ్యాప్ లేదు. అయినా ఓ కుర్రోడు తన బైక్ ఒంటెలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు.

  • Publish Date - September 2, 2019 / 09:12 AM IST

రోడ్డు మీద ఒంటెల గుంపు వెళ్తోంది. వాహనాలు వెళ్లేందుకు కొంచెం కూడా గ్యాప్ లేదు. అయినా ఓ కుర్రోడు తన బైక్ ఒంటెలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు.

రోడ్డు మీద ఒంటెల గుంపు వెళ్తోంది. వాహనాలు వెళ్లేందుకు కొంచెం కూడా గ్యాప్ లేదు. అయినా ఓ కుర్రోడు తన బైక్ తో ఒంటెలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. రోడ్డు పక్క నుంచి బైక్ నడిపాడు. అంతే.. పక్కన వెళ్లే ఒంటెకు కోపం కట్టలు తెంచుకుంది. నన్నే ఓవర్ టేక్ చేస్తావా అన్నట్టు బైకిస్టును తన ఎడమ కాలితో గట్టిగా జాడిచ్చి తన్నింది.

అంతే.. బైక్ తో సహా ఆ యువకుడు ఎగిరిపడ్డాడు. అదృష్టవశాత్తూ బైకిస్టుకు ఎలాంటి గాయాలు కాలేదు. చూడటానికి ఫన్నీగా ఉన్న ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియనప్పటికీ ఈ వీడియోను చూసిన చాలామంది లడక్ లో జరిగింది కొందరు.. మంగోలియాలో జరిగిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

రోడ్డు మీద వెళ్లేటప్పుడు రాంగ్ సైడ్‌లో ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నిస్తే ఇలాంటి పెనాల్టీనే ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియోకు క్యాప్షన్ కూడా ఉంది. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు చాలామంది తమ ముందు వాహనాలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రమాదమని తెలిసి కూడా రాంగ్ సైడులో ర్యాష్ గా వెళ్తుంటారు.

ఫలితంగా ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవర్ టేక్ చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురువుతాయని ఒంటె తన భాషలో చెప్పిందని కామెంట్లు పెడుతున్నారు. బైకిస్టును ఒంటె తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.