Ghulam Nabi Azad : జమ్మూకశ్మీర్ విషయంలో ఆ తప్పు చేయొద్దు

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ లో మొదట నియోజకవర్గాల పునర్విభజన చేసి

Ghulam Nabi Azad  కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ లో మొదట నియోజకవర్గాల పునర్విభజన చేసి ఆ తర్వాత రాష్ట్ర హోదా ఇవ్వాలనుకుంటే అది పొరపాటే అవుతుందని.. అలాంటి తప్పు చేయవద్దని కేంద్రానికి తాను విజ్ణప్తి చేస్తున్నానని ఆదివారం ఆజాద్ పేర్కొన్నారు.

ఆదివారం ఆజాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…కశ్మీర్ నేతలను ప్రధాన మంత్రి తన ఇంటికి ఆహ్వానించినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. తామందరం ముందు రాష్ట్ర హోదా కోరుకుంటున్నామని, ఆ తర్వాతే ఎన్నికలని చాలా గట్టిగా చెప్పాం. ఇతర పార్టీలు కూడా ఇదే డిమాండ్ చేశాయి. రాష్ట్ర హోదా మంజూరు చేస్తాం, డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు.

రాష్ట్ర హోదా మంజూరు చేయబడుతున్నందుకు, రాష్ట్రాన్ని రెండుగా విభజించకుండా చూస్తున్నందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపాను. కానీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రాష్ట్ర హోదా ఇస్తామంటే అది పొరపాటే అవుతుంది. ఆ పని చేయవద్దు అని ఆజాద్ పేర్కొన్నారు. ముందు ఎన్నికలు జరిపిన తర్వాతే రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రం అనుకుంటున్నట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మొదట రాష్ట్రహోదా ఇచ్చి ఎన్నికలు జరపాలనన్నారు. రాష్ట్రం రెండుగా విభజించడం వల్ల తాము చాలా కోల్పోయామని, అసెంబ్లీ రద్దుతో ఎంతో కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే జమ్మూకశ్మీర్ స్వరూపమే మారిపోతుందని తమతో చెప్పారని..కానీ, అవేవీ జరగలేదన్నారు.

ALSO READ Lakhimpur Kheri : లఖింపూర్ నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ

ట్రెండింగ్ వార్తలు