Lakhimpur Kheri : లఖింపూర్ నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ

ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో పోలీస్ రిమాండ్ లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు

Lakhimpur Kheri : లఖింపూర్ నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ

Lakhimepur

Lakhimpur Kheri  ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో పోలీస్ రిమాండ్ లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ సోకింది. శుక్రవారం ఆయనకు రెండు రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే తనకు జ్వరంగా ఉందని ఆశిష్ చెప్పడంతో అధికారులు ఆయన బ్లడ్ శాంపిల్స్ ను టెస్ట్ కోసం పంపారు.

రిపోర్టులో ఆశిష్‌కు డెంగీ వచ్చినట్లు తేలింది. అతని ఆరోగ్యం క్షీణించడంతో ఆశిష్ మిశ్రాను శనివారం రాత్రి 10 గంటలకు జిల్లా జైలు హాస్పిటల్ లో చేర్చారు. జిల్లా జైలు లోని హాస్పిటల్ లోనే ఆశిష్ మిశ్రాకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అక్టోబర్-3,2021న లఖింపూర్‌ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్​లను నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్యాయ్ లోని ఓ కారు,మరో వాహానం రైతులపై దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మొత్తంగా ఎనిమిది మంది లఖింపూర్ ఖేరీ ఘటనలో  ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినవారిలో నలుగురు రైతులు, ముగ్గురు కార్యకర్తలు,కేంద్ర సహాయక మంత్రి కారు డ్రైవర్ ఉన్నారు. అయితే రైతులపైకి దూసుకువచ్చిన కారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆశిష్‌ మిశ్రా తో పాటు కు రెండు సార్లు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.

ALSO READ Drug Lord Otoniel : కొలంబియా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్