Drug Lord Otoniel : కొలంబియా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్

కొలంబియాలోని మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి "డైరో ఆంటోనియా ఉసుగా" అలియాస్​ ఒటోనియల్(50) ను ఆ దేశ భద్రతా బలగాలు పట్టుకున్నాయి. దట్టమైన అరణ్యాల గుండా డ్రగ్స్ స్మగ్లింగ్​ చేసే

Drug Lord Otoniel : కొలంబియా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్

Columbia

Colombia Drug Lord  కొలంబియాలోని మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి “డైరో ఆంటోనియా ఉసుగా” అలియాస్​ ఒటోనియల్(50) ను ఆ దేశ భద్రతా బలగాలు పట్టుకున్నాయి. దట్టమైన అరణ్యాల గుండా డ్రగ్స్ స్మగ్లింగ్​ చేసే “గల్ఫ్ క్లేన్”​ బృందానికి ఒటోనియల్ నాయకుడు. 500 మందికిపైగా ప్రైవేటు సైన్యం, అమెరికా, బ్రిటన్​కు చెందిన కొందరు అవినీతి అధికారుల సాయంతో పదేళ్లుగా అడవుల్లోని రహస్య స్థావరంలో తలదాచుకున్న ఒటోనియల్ ని అరెస్ట్ చేసినట్లు శనివారం కొలంబియా అధికారులు తెలిపారు.

రబ్బరు బూట్లు, సంకెళ్లు వేసిన ఉసుగా ఫొటోలను కొలంబియా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ శతాబ్దంలో కొలంబియాలో డ్రగ్ప్ అక్రమ రవాణాకు ఇది అత్యంత కఠినమైన ఎదురుదెబ్బ అని ఆ దేశ అధ్యక్షుడు ఇవాన్​ డ్యూక్​ తెలిపారు . ఒటోనియల్ అరెస్ట్​ను…మూడు దశాబ్దాల క్రితం డ్రగ్స్ సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందిన “పాబ్లో ఎస్కోబార్​”ను పట్టుకోవడంతో పోల్చారు.

నెకోక్లి మునిసిపాలిటీలో 22 హెలికాప్టర్ల మద్దతుతో దాదాపు 500 మంది సైనికులు ఆపరేషన్‌ను నిర్వహించి ఒటోనియల్ ను పట్టుకున్నారని,ఈ ఆపరేషన్ లో ఒక పోలీసు అధికారి మరణించారని కొలంబియా అధ్యక్షుడు తెలిపారు. కొలంబియా సైనిక చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి అతిపెద్ద అడవి చొరబాటు ఇదని డ్యూక్ తెలిపారు.

కొలంబియా పోలీసు చీఫ్ జార్జ్ వర్గస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..అమెరికా మరియు బ్రిటన్ ఏజెన్సీలతో కలిసి అధికారులు ఒక ముఖ్యమైన శాటిలైట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒటోనియల్.. ఉరాబా ప్రాంతంలోని అడవిలో దాక్కున్నాడు. టెలిఫోన్ ని కూడా ఒటోనియల్ ఉపయోగించలేదు. కమ్యూనికేట్ చేయడానికి కొరియర్‌లపై ఆధారపడేవాడు. అధికారులకు భయపడి ఒటోనియల్ వర్షంలో పడుకున్నాడని, ఎప్పుడూ జనావాస ప్రాంతాలకు చేరుకోలేదని వర్గస్ చెప్పారు.

కాగా,ఒటోనియల్ నేతృత్వంలోని “గల్ఫ్ క్లేన్”​ గ్యాంగ్..ఉత్తర అమెరికా, మధ్య అమెరికాలకు డ్రగ్స్​ను తరలించేందుకు అనువైన ప్రధాన మార్గాలపై నియంత్రణ సాధించేందుకు హత్యలు చేసి.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఒ

టోనియల్​ను పట్టుకోవడానికి అమెరికా పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఒటోనియల్​ జాడ తెలిపినవారికి రూ.37కోట్ల 50 లక్షలు రివార్డు ప్రకటించింది అమెరికా. 2009లో అమెరికా నిషేధిత తీవ్రవాద సంస్థకు సాయం, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు 2009లో న్యూయార్క్​ ఫెడరల్ కోర్టులో ఒటోనియల్ పై అభియోగాలు మోపారు అధికారులు. 2003 నుంచి 2014 వరకు వెనిజులా, గ్వాటెమాల, మెక్సికో, పనామా, హోండురాస్ దేశాల ద్వారా 73 మెట్రిక్​ టన్నుల డ్రగ్స్​ అమెరికాకు చేరవేసినట్లు నేరారోపణలు రుజువవడం వల్ల బ్రూక్లిన్​, మయామి ఫెడరల్​ కోర్టులు ఒటోనియల్ దోషిగా తేల్చాయి.

ALSO READ Amith Shah : జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవరూ ఆపలేరు..యువత భాగస్వామ్యంతోనే ఉగ్రవాదానికి చెక్