కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో..హోలీ ఆడవద్దని ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIMS) హెచ్చరించింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ప్రబలుతోందని, ప్రజలు ఒక్కదగ్గర చేరి..హోలీ వేడుకలు జరుపుకోవడం వల్ల..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరికలు జారీ చేశారు.
హోలీ ఆడకుండా..పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని, S-95 మాస్క్‌లు ధరించాలని సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వ్యక్తులు హోలీ ఆడితే..వారికి సమీపంలో ఉన్న వారికి అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఎయిమ్స్ సీనియర్ చెస్ట్ స్పెషలిస్టు డాక్టర్ ఆశీష్ జైస్వాల్ తెలిపారు. హోలీ వేడుకల్లో ఉపయోగించే రంగుల్లో రసాయనాలు ఉంటాయని, వీటివల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉందని ఫిజీషియన్ డాక్టర్ రమణ కుమార్ తెలిపారు. అంతేగాకుండా..అలర్జీలు, చర్మానికి సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చన్నారు.
హోలీలో వాడే రంగులు చాలా ప్రమాదకరమైనవి. సింథటిక్ రంగుల్లో వివిధ రసాయానాలు కలుస్తాయని, ఇవి కళ్లల్లో పడితే..కొన్ని సార్లు చూపు పోయే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. హోలీ తర్వాత..ఎంతో మంది సరోజనిదేవి కంటి ఆసుపత్రిని సంప్రదించిన ఘటనలు చూసే ఉంటాం. దీంతో ముందే..అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. సో..ఇంత ప్రమాదం ఉన్న నేపథ్యంలో హోలీకి దూరంగా ఉండాలని సూచించారు.
Read More : ట్యాప్ తిప్పితే..రెడ్ వైన్ వచ్చింది
See More :
* కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు