మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే శనివారం అసెంబ్లీలో బల పరీక్ష గెలవాల్సి ఉంది. సరిగ్గా దీనికి ముందే గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఎత్తేయడంపై సానుభూతి చూపిస్తూ శివసేనకు చెందిన మీడియా సామ్నా ఎడిటోరియల్‌లో కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీ, మహారాష్ట్ర ప్రాంతం ఏదైనా రాజకీయ నాయకులు భద్రతగా ఉండే వాతావరణం నెలకొల్పాలని పేర్కొంది.
గాంధీ కుటుంబంలో ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగించింది ప్రభుత్వం. ప్రధాని, హోం మంత్రి, ఇతర మంత్రులు సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండా బయటకు వెళ్లేందుకు సమ్మతించడం లేదు. దీనిని బట్టి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉండాలని స్పష్టమవుతోంది. ఈ కారణంతోనే వాడేసిన కాన్వాయ్‌లను తిప్పి పంపేస్తున్నారు.
హోం శాఖ గాంధీ కుటుంబానికి ప్రమాద స్థాయి తగ్గిపోయిందని, ఇక నుంచి ఎస్పీజీ సెక్యూరిటీ లేకపోయినా పరవాలేదని చెప్పుకొచ్చింది. నిజానికి హోం శాఖలో ఉన్న వ్యక్తులు ఎవరు అలా ఫీల్ అవుతున్నారనేది ప్రశ్నగానే మిగిలింది. అలా అనకుంటే హోం శాఖ దేవేంద్ర ఫడ్నవీస్ కు మహారాష్ట్రలో క్లియర్ మెజార్టీ వస్తుందని భావించింది. ప్రెసిడెంట్ రూల్ ఎత్తేసి మహారాష్ట్రకు సీఎం చేసి కూర్చోబెట్టింది. కొద్ది రోజులకే ఫడ్నవీస్ రాజీనామా ప్రకటించాడు. హోం శాఖ అంచనాల్లో ఎంత నిజముందే దీనిని బట్టే తెలుస్తోంది’ అని ఎడిటోరియల్ కాలమ్ లో రాసుకొచ్చింది సామ్నా.