PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి

దరికీ సమానత్వం, గౌరవం మరియు మానవ విలువలను పంచడమే నాయకుడి లక్షణమని సాటిచెబుతూ నిజమైన ప్రజల మనిషిగా నరేంద్ర మోదీ భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు

PM Modi: గత మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కృషి, అంకితభావం మరియు భారతదేశ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఏపాటిదో ఇప్పటికే దేశ ప్రజలకు అర్ధం అయింది. ఏదో కాకతాళీయంగా పదవులు పొందడం కాదు, ప్రజా నేతగా నరేంద్ర మోదీ తన మూలాలకు కట్టుబడి ఉన్నాడు. నిజమైన నాయకుడు, అధికారం అవినీతికి పాల్పడనవసరం లేదని ప్రధాని మోదీ ఉదాహరణగా నిలిచారు. అందరికీ సమానత్వం, గౌరవం మరియు మానవ విలువలను పంచడమే నాయకుడి లక్షణమని సాటిచెబుతూ నిజమైన ప్రజల మనిషిగా నరేంద్ర మోదీ భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. నేతగా ప్రజలకు ఎంత సేవ చేసినా..తన వ్యక్తిగతంగా ప్రధాని తన చుట్టూ ఉండేవారి పట్ల ఎంత భాద్యతగా ఉంటారో చెప్పే ఘటనలు కొన్ని. 90వ దశకంలో మోదీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉనన్ సమయంలో అతని డ్రైవర్‌గా పనిచేసిన హస్ముఖ్ పర్మార్, తనతో మోదీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Other Stories:Touching Video: వైరల్ వీడియో: నీటిలో మునిగిపోతున్న దుప్పి కోసం తల్లడిల్లిన ఏనుగు

అప్పట్లో మోదీ డ్రైవరైన పర్మార్..అహ్మదాబాద్‌లోని దరియాపూర్‌లో ఓ అద్దె ఇంట్లో నివసించేవారు. ఆసమయంలో ఒకసారి పర్మార్ ఇంటికి వచ్చారు మోదీ. దీంతో మోదీకి టీ ఇచ్చేందుకు ఎంతో శ్రమ పడ్డాడు పర్మార్. టీ తయారు చేయడానికి పర్మార్‌కు చాలా సమయం పట్టింది. గ్యాస్ కనెక్షన్ లేక పర్మార్ కట్టెల పోయి మీదే టీ తయారు చేయడం మోదీ గ్రహించారు. వెంటనే పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసిన మోదీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ ఎంపి కోటా కింద పర్మార్‌కు గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు. అప్పట్లో గ్యాస్ కనెక్షన్ అంత సులభంగా లభించేది కాదు. ఇక మరో సందర్భంలో, అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజ్ హాస్పిటల్‌ డాక్టర్ గిరీష్ పర్మార్, మోదీతో ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన పంటి చికిత్స కోసం డెంటల్ డాక్టర్ గిరీష్ వద్దకు వచ్చారు. అదే సమయంలో సీఎం భద్రతా సిబ్బందిలో ఒకరు పంటి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుసుకున్న మోదీ, ముందు తన భద్రతా సిబ్బందికి చికిత్స అందించాలని అప్పటి వరకు తాను వేచి ఉంటానని వైద్యులకు సూచించారు.

Other Stories:Gyanvapi Mosque: తవ్వకాలు మక్కాలో జరిపితే అక్కడా శివుని విగ్రహాలు కనిపిస్తాయి – డిప్యూటీ సీఎం

అంతే కాదు సీఎంగా తనకు ఎటువంటి వైద్యం అందిస్తున్నారో, తన భద్రత సిబ్బందికి కూడా అంతే ఉత్తమమైన చికిత్స అందించాలని మోదీ సూచించారు. పై రెండు కథలు ప్రధానమంత్రి మోడీ తన తోటివారి పట్ల ఎంత శ్రద్ధ మరియు జాగ్రత్తగా ఉండేవారో చెప్పే ఘటనలైతే, ప్రతి వ్యక్తికి వారు చేసే పనిపట్ల గౌరవం ఎలా ఇవ్వాలి, ప్రభుత్వ కార్యాలయల్లో పనిచేసే సిబ్బంది పట్ల మోదీకి ఉన్న బంధం ఏపాటిదో ఈ రెండు ఘటనలు చెబుతున్నాయి. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు ఆనాడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్ర సచివాలయంలో రెండు కొత్త భవనాలు ప్రారంభించాల్సి ఉంది. భవనాల ప్రారంభోత్సవానికి ఎవరిని ఆహ్వానించాలని అధికారులందరూ మల్లగుల్లాలు పడ్డారు. విషయం సీఎం మోదీ దృష్టికి వెళ్లగా..సచివాలయంలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న ప్యూన్ ని ఆహ్వానించండి అని మోదీ అన్నారట.

Other Stories:Amit Shah: అమిత్ షా ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తి అరెస్ట్

దీంతో అప్పటి సచివాలయంలో ఎన్నో రోజులుగా పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించి చివరకు ఎంతో నిబద్దతో పనిచేసిన ఒక వృద్ధ ప్యూన్ తో రెండు కొత్త భవనాల రిబ్బన్ కటింగ్ జరిగింది. ఇక 90వ దశకంలో మోదీ హర్యానా రాష్ట్ర ఇన్‌చార్జి (ప్రభరి)గా ఉన్న రోజుల్లో BJP రోహ్‌తక్ కార్యాలయంలో దీపక్ కుమార్ అనే వ్యక్తి మోడీకి వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవాడు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఒకసారి హర్యానాలో ర్యాలీకి వెళ్లిన మోదీ, దీపక్‌ను గుర్తు చేసుకోవడమే కాకుండా, అతన్ని వేదికపైకి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నారు. అంతే కాదు వేదికపై ఉన్న ముగ్గురు గవర్నర్‌లకు దీపక్‌ను పరిచయం చేశారు ప్రధాని మోదీ. ” దీపక్ ఎవరు అంటూ అందరు తన కోసం వెతుకుతున్నారు” అంటూ ఆ రోజు జరిగిన దృశ్యాన్ని ప్రేమగా మరియు గర్వంగా గుర్తుచేసుకున్నాడు దీపక్.

Other Stories:China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా

తమను ఎన్నుకున్న ప్రజల పట్ల నేతలు బాధ్యతను కలిగి ఉంటారని ప్రధాని మోదీ పదే పదే చాటిచెబుతున్నారు. భారత ప్రధానిగా ఎన్నికైన అనంతరం మోదీ ఢిల్లీకి మారాల్సి వచ్చినప్పుడు, అప్పటి వరకు తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేయగా వచ్చిన జీతం నుంచి తన పొదుపులో ఒక్క పైసా కూడా తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. బదులుగా, ఆ మొత్తాన్ని సీఎం కార్యాలయంలోని ప్యూన్లు, భద్రతా సిబ్బంది, సాధారణ సిబ్బంది పిల్లల చదువుల కోసం ఆడబ్బును విరాళంగా ఇచ్చారు. చిన్న వార్డు మెంబెర్ పదవికే హంగు ఆర్భాటాలు ప్రదర్శిస్తున్న ఈరోజుల్లో, ప్రధాని మోదీ తన నిశ్శబ్ద చర్యల ద్వారా ఒకరి జీవితం మరొకరికి ప్రేరణగా ఉండాలని చూపించారు.

ట్రెండింగ్ వార్తలు