Gyanvapi Mosque: తవ్వకాలు మక్కాలో జరిపితే అక్కడా శివుని విగ్రహాలు కనిపిస్తాయి – డిప్యూటీ సీఎం

జ్ఞానవాపి మసీదులో జరిపిన సోదాల్లో శివలింగం బయటపడటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్న యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. సౌదీ అరేబియాలోని మక్కాలో తవ్వకాలు జరిపితే..

Gyanvapi Mosque: తవ్వకాలు మక్కాలో జరిపితే అక్కడా శివుని విగ్రహాలు కనిపిస్తాయి – డిప్యూటీ సీఎం

Gyanvapi

Updated On : May 16, 2022 / 6:40 PM IST

 

 

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో జరిపిన సోదాల్లో శివలింగం బయటపడటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్న యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. సౌదీ అరేబియాలోని మక్కాలో తవ్వకాలు జరిపితే అక్కడా శివలింగం కనిపిస్తుందంటున్నారు. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూలో..

“అప్పటి రోజుల్లో మేం కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్లినప్పుడు మాతా శ్రింగార్ గౌరీని దర్శించుకుని ప్రార్థనలు చేసేవాళ్లం. ఇప్పుడు ఉద్యమించాం. జ్ఞానవాపిలో మహాదేవుని విగ్రహం కనిపించడం చాలా సంతోషంగా ఉంది. మక్కాలో తవ్వకాలు జరిపినా మహాదేవుని విగ్రహాలు కనిపిస్తాయనే నమ్మకముంది” అని వెల్లడించారు.

జ్ఞానవాపిలో బయటపడ్డ శివలింగం, ఇతర వస్తువులు కాంట్రవర్సీ చేస్తున్న వాళ్లకు సమాధానంగా మారాయి. మహాదేవుని విగ్రహం బయటపడటం ఆ భక్తులకు చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టిందని మౌర్య పేర్కొన్నారు.

Read Also: జ్ఞానవాపి మసీదులో శివలింగం.. సీజ్ చేయాలన్న కోర్టు