Sales Of Mobile Phones
Sales Of Mobile Phones: పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతీఒక్కరూ వస్తువుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యతనిస్తారు. దీనికితోడు ఆఫర్లు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేసేందుకు పోటీపడుతారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లుతో పాటు గృహోపకరణాలు, ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీంతో పండుగల సమయంలో ఇ-కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి విక్రయాలు జరుపుతాయి. తాజాగా దసరా పండుగ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోళ్లు సైతం భారీగా జరిగాయి.
ఇ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్ సేల్ -1లో (సెప్టెంబర్ 22-30) సుమారు రూ. 40,000 కోట్ల విక్రయాలు నమోదు చేశాయని రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టింగ్ నివేదిక అంచనా వేసింది. గతేడాది కంటే ఈ మొత్తం సుమారు 27శాతం అధికమని నివేదిక తెలిపింది. అయితే, మొబైల్ ఫోన్ల విక్రయాలు పెరగడం, వృద్ధికి ఉపకరించిందని వెల్లడించింది. మొత్తం స్థూల మర్కండైజ్ విలువ (జీఎంవీ)లో ఈ విభాగం వాటా 41శాతం ఉందని, సగటున గంటకు 56వేల మొబైల్ ఫోన్లు విక్రయాలు జరిగాయని రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టింగ్ నివేదిక అంచనా వేసింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
సెల్ ఫోన్ల అమ్మకాలు ఏడు రెట్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల విక్రయాలు ఐదు రెట్లు, ఇతర విభాగాల అమ్మకాలు రెండు రెట్లు పెరిగినట్లు నివేదిక అంచనా వేసింది. అయితే, ఫ్యాషన్ ఉత్పత్తుల విభాగం వాటా మొత్తం జీఎంవీలో 20శాతంగా ఉందని, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ విభాగం అమ్మకాలు 48శాతం పెరిగినట్లు నివేదిక అంచనా వేసింది. నివేదిక ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ స్థూల సరుకుల విలువ (జీఎంవీ) పరంగా దాదాపు 62శాతం వాటాతో ఫెస్టివ్ సేల్-1కి నాయకత్వం వహించింది. తర్వాత స్థానంలో అమెజాన్ జీఎంవీ 26శాతంతో నిలిచింది. ఆర్డర్ వాల్యూమ్ పరంగా.. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ 49 శాతం వాటాతో మార్కెట్‌లో ముందువరుసలో నిలిచింది. మీషో 21 శాతం ఆర్డర్ షేర్‌తో రెండవ స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది.