Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్‌తో చర్చించిన అనంతరం కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.

kusukuntla prabhakar reddy
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్‌తో చర్చించిన అనంతరం కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కూసుకుంట్ల మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మరోసారి పోటీచేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జిగా ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తనపేరును ప్రకటించినందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 10టీవీతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచి మునుగోడులో అభివృద్ధి పనులు చేపట్టి మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపాడు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ మాకు పోటీయే కాదని, ఈ ఉప ఎన్నికతో గెలిచేది మునుగోడు ప్రజలే అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందుకే నిధులు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని, ఒకవేళ ఉప ఎన్నికలో బీజేపీ తరుపున గెలిస్తే ప్రతిపక్షంలో ఉన్నట్లు కాదా అంటూ కూసుకుంట్ల ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధిని పట్టించుకోలేదని, ఆయనకు ఈసారి డిపాజిట్ కూడా దక్కదని కూసుకుంట్ల జోస్యం చెప్పాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. శని, ఆదివారాల్లో మినహా ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.