Munugode Bypoll: మునుగోడు ఉపపోరుకు నేటి నుంచి నామినేషన్లు.. గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు.. 15మంది మంత్రులు మునుగోడులోనే మకాం..

మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నేటినుంచి షురూ చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.

Munugode Bypoll: మునుగోడు ఉపపోరుకు నేటి నుంచి నామినేషన్లు.. గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు.. 15మంది మంత్రులు మునుగోడులోనే మకాం..

Munugode Bypoll: మునుగోడు ఉప పోరుకు ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 3న షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని పార్టీలు తమ కార్యాచరణలో వేగం పెంచాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండలాల వారీగా ఇన్ చార్జీలను నియమించాయి. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.

Munugodu bypoll schedule: నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల

ఉపపోరుకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 11 గంటలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జారీ చేయనున్నారు. ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు వ్యవహరిస్తారు. నోటిఫికేషన్ విడుదలకాగానే నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 10 నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 14న చివరి రోజు నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరుదాదాపు ఖరారైంది. అయితే నేడు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో నవ్వులు పూయించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధిరామయ్య పరుగు.. వీడియో వైరల్

మునుగోడు ఉపపోరును సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్పుచేసిన తరువాత తొలిసారి జరిగే ఉపపోరులో విజయం సాధించేలా లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అందివచ్చిన ప్రతీఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను గ్రామాల వారిగా ఇన్ చార్జిలుగా నియమించి మునుగోడులో మకాంవేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 15 మంది మంత్రులు, 71 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. ఉపపోరులో ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారపర్వాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.  నేడు 15మంది మంత్రులు మునుగోడుకు వెళ్లి వారికి కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమవ్వనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు బీజేపీ సైతం ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాంతాలు, కాలనీలు వారీగా పార్టీ నేతలను మోహరించనుంది. గురువారం మునుగోడుపై సంఘ్ పరివార్ సమీక్ష నిర్వహించింది. బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి ఈ సమావేశంకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.