ఢిల్లీలో భూకంపం : భయంతో పరుగులు తీసిన జనం
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-20-2019) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పలు సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 4.0 గా

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-20-2019) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పలు సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 4.0 గా
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఉదయం భూకంపం సంభవించింది. ఉ.8గంటల ప్రాంతంలో పలు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్ పై ప్రకంపనల తీవ్రత 4.0 గా నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ కేంద్రంగా భూమికి 5కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని తెలిపారు.
ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. దీనికి కారణం తజకిస్తాన్ లో సంభవించిన భూకంపమే అని తేల్చారు. తజకిస్తాన్ లో వచ్చిన భూకంపం ప్రభావం ఉత్తర భారత దేశంపై చూపింది. భూ ప్రకంపనల విషయాన్ని కొందరు ఢిల్లీ వాసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించిందని ఒకరు, ఒక్కసారిగా నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచానని మరొకరు.. భూ ప్రకంపనలతో ఆందోళనకు గురయ్యామని ఇంకొకరు.. తమ అనుభవాలను షేర్ చేశారు.