Earthquake: లడఖ్‌లో భూకంపం

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత స్వల్పంగానే ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు.

Earthquake: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత స్వల్పంగానే ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. లడఖ్‌లోని లేహ్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో భూకం వచ్చిందని, రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ(NCS) వెల్లడించింది.

అర్ధరాత్రి భూమి కంపించడంతో ప్రజలు భయపడినట్లుగా చెబుతున్నారు. ఇళ్లనుంచి పరుగులు తీశారని, భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.

జపాన్ రాజధాని టోక్యోలో కూడా బలమైన భూకంపం సంభవించగా 30మందికి పైగా గాయపడ్డారు. షాక్ చాలా బలంగా ఉండగా.. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా, తొక్కిసలాట జరిగినట్లుగా అధికారులు చెప్పారు. మొదట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా అంచనా వేయగా.. తర్వాత 5.9కి తగ్గించబడింది.

పొరుగు దేశమైన మయన్మార్‌లో కూడా భూమి కంపించినట్లుగా అధికారులు ప్రకటించారు. గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు మయన్మార్‌లోని మోన్యవా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.5గా నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు