EC Ban Rallies : ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలపై నిషేధం పొడిగింపు..

వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల (పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా) అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది.

EC Ban Rallies : వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల (పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా) అసెంబ్లీ ఎన్నికలు జరుగున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. దేశంలో కరోనావైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ పొడిగించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర కమీషనర్లు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మరో వారం రోజుల పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఈసీ వెల్లడించింది. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు నిరంతరం పెరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మరో వారం రోజులు నిషేదాజ్ఞలను పొడిగించాలని నిర్ణయించింది. దేశంలో కరోనా దృష్ట్యా ఈ నెల 8 నుంచి 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇప్పుడా నిషేధాన్ని ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది.


అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మరో వారం రోజులు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఇన్ డోర్ సభల్లో 300కి మించి పాల్గొనరాదని ఈసీ స్పష్టం చేసింది. సభలు, సమావేశాల్లో 50 శాతం సీటింగ్ మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.


ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) నిబంధనలను, కోవిడ్ మార్గదర్శకాలను అన్ని రాజకీయ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. MCC, కోవిడ్‌కు సంబంధించిన ఆదేశాలను సక్రమంగా అమలు జరిగేలా చూడాలని రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read Also : UP Elections: గోరఖ్‌పూర్ నుంచి యోగిని బరిలో దించడంపై బీజేపీ మాస్టర్ ప్లాన్

ట్రెండింగ్ వార్తలు