మోడీని మాత్రమే చూపిస్తారా : దూరదర్శన్‌పై ఈసీ ఆగ్రహం

సార్వత్రిక ఎన్నికల వేళ డీడీ దూరదర్శన్ తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. డీడీ దూరదర్శన్ కి అక్షింతలు వేసింది.

  • Publish Date - April 10, 2019 / 06:35 AM IST

సార్వత్రిక ఎన్నికల వేళ డీడీ దూరదర్శన్ తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. డీడీ దూరదర్శన్ కి అక్షింతలు వేసింది.

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ డీడీ దూరదర్శన్ తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. డీడీ దూరదర్శన్ కి అక్షింతలు వేసింది. డీడీలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన సమయం కేటాయించాలని ఆదేశించింది. ఒక్క ప్రధాని మోడీనే చూపించకుండా అన్ని పార్టీలకు సమయం ఇవ్వాలని దూరదర్శన్ ని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సమాచార శాఖకూ నోటీసులు పంపింది. 
Read Also : గోల్డ్ రష్ : రూ.57 కోట్ల విలువైన బంగారం పట్టివేత

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి (మార్చి 10) దూరదర్శన్ లో బీజేపీ, మోడీనే ఎక్కువగా చూపిస్తున్నారని ఇతర పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. తమకు తగినంత సమయం ఇవ్వకపోడం అన్యాయం అంటూ ఈసీ దగ్గర వాపోయాయి. ఫిర్యాదులపై విచారణ జరిపిన ఈసీ.. ఇతర పార్టీలకు తగినంత సమయం ఇవ్వకపోవడాన్ని గుర్తించింది. దూరదర్శన్ వివక్ష చూపించడాన్ని తప్పుపట్టింది. ఎలాంటి వివక్ష చూపించొద్దని డీడీ యాంకర్లు, న్యూస్ రీడర్లకు ఆదేశించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉపన్యాసాలతో కూడిన నమో టీవీ ప్రసారాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, ఆప్ నేతలు కొన్ని రోజుల క్రితం ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ఉపన్యాసాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, ఐదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పథకాలపై ప్రచారం చేస్తున్నారని ఈసీకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు దూరదర్శన్ లో మైనే భీ చౌకీదార్, ప్రధాని మోడీ లైవ్ టెలీకాస్ట్ , నమో యాప్ ల ద్వారా ప్రసారాలు సాగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీవీ ప్రసారాలను నిలిపివేయాలని కాంగ్రెస్, ఆప్ నేతలు ఈసీని కోరారు.
Read Also : చైతన్యం వచ్చింది : పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు