Money Laundering Case: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

కొంతమంది రియల్ ఎస్టేట్ డీలర్లు, ప్రైవేట్ వ్యక్తులు, అనుబంధ సంస్థలపై ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై దాఖలైన రెండు పిల్‌లలో పిటిషనర్ తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ కుమార్‌ను ట్రాప్ చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అగర్వాల్‌ను గత నెలలో ఈడి అరెస్టు చేసింది. ఈ కేసులో ఇటీవల సోరెన్‌ను కూడా పిలిచారు. ఆయన సహాయకులలో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తోంది.

Money Laundering Case: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో ఎన్‭ఫోర్స్‭మెంట్ డైరక్టరేట్ శుక్రవారం ఆకస్మిక దాడులు చేసింది. రక్షణ శాఖ ఆధీనంలోని సైన్యానికి చెందిన భూములను ఆక్రమించుకుని దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇలా స్పందించింది. ఈ రాష్ట్రాలతో పాటు రాజస్తాన్ రాష్ట్రంలోని బికనీర్, నోఖా ప్రాంతాల్లోని 40 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బికనీర్ నగరంలో తయాల్ గ్రూప్, రాఠీ గ్రూప్, జావర్ గ్రూపు ప్రాంగణాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎస్ఆర్ఎస్ గ్రూప్ కంపెనీల చైర్మన్‭తో పాటు మరో 19 మంది నిందితులపై దాడులు సాగుతున్నాయి.

కొంతమంది రియల్ ఎస్టేట్ డీలర్లు, ప్రైవేట్ వ్యక్తులు, అనుబంధ సంస్థలపై ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై దాఖలైన రెండు పిల్‌లలో పిటిషనర్ తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ కుమార్‌ను ట్రాప్ చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అగర్వాల్‌ను గత నెలలో ఈడి అరెస్టు చేసింది. ఈ కేసులో ఇటీవల సోరెన్‌ను కూడా పిలిచారు. ఆయన సహాయకులలో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తోంది.

Imran Khan: దేవుడు నాకు మరో జీవితాన్ని ఇచ్చాడు.. కాల్పులపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్

ట్రెండింగ్ వార్తలు