హైదరాబాద్‌కు ఈజిప్టు ఉల్లి..ఢిల్లీకి టర్కీ ఉల్లిగడ్డలు

  • Published By: madhu ,Published On : December 4, 2019 / 05:29 AM IST
హైదరాబాద్‌కు ఈజిప్టు ఉల్లి..ఢిల్లీకి టర్కీ ఉల్లిగడ్డలు

Updated On : December 4, 2019 / 5:29 AM IST

ఆకాశన్నంటిన ఉల్లిగడ్డ ధరలను తగ్గించడానికి కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టర్కీ దేశం నుంచి 11 వేల మెట్రిక్ టన్నులు ఢిల్లీకి రానున్నాయి. అలాగే ఈజిప్టు నుంచి 6 వేల 090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు హైదరాబాద్‌కు రానున్నాయి. ఉల్లి దిగుమతికి కేంద్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ రెండో వారనికల్లా..ఉల్లిగడ్డలు సరఫరా అవుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖాధికారులు వెల్లడించారు.

ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయకుండా..నిషేధం విధించడం ద్వారా ధరలను నియంత్రించాలని కేంద్రం అనుకొంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ, పౌరసరఫఱాలు, వ్యవసాయ, రోడ్డు రవాణాశాఖల మంత్రులతో కలిసి ఓ కమిటీని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి గడ్డల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. ఈజిప్టు నుంచి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్న వాటిని రాష్ట్రాన్ని తెప్పిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి వెల్లడించారు.

త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని, సరూర్ నగర్, మెహిదీపట్నం రైతు బజార్లో సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కిలో ఉల్లిగడ్డ రూ. 40 చొప్పున విక్రయిస్తామన్నారు. ఏపీ, కర్ణాటకల నుంచి వస్తున్న రెండో రకం ఉల్లి..రూ. 60 వరకు ఉన్నాయన్నారు. కొంత రాయితీ తగ్గించి..ఇవ్వాలని కేంద్రాన్ని తాజాగా కోరింది. పలు రాష్ట్రాలు కూడా ఇదే తీరుగా కేంద్రానికి విన్నవించాయి. 
Read More : NASAvsISRO : విక్రమ్ ఆచూకీ ముందే గుర్తించాం