Tehreek-e-Hurriyat banned
Union Home Minister Amit Shah : జమ్మూకశ్మీరుకు చెందిన తెహ్రీక్ ఏ హురియత్ సంస్థపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ బహిష్కరణ వేటు వేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద తెహ్రీక్-ఎ-హురియత్ చట్టవిరుద్ధమైన సంఘంగా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థకు గతంలో మరణించిన వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించారు.
ALSO READ : Red alert : కొత్త సంవత్సరంలో రెడ్ అలర్ట్ జారీ…ఎందుకంటే…
జమ్మూ కాశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు తెహ్రీక్ ఏ హురియత్ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక ప్రచారాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తమ హోంమంత్రిత్వశాఖ బృందం గుర్తించిందని అమిత్ షా పేర్కొన్నారు.
ALSO READ : Drug Detection Kit : డ్రగ్స్ వాడితే ఇట్టే దొరికిపోతారు
‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ పాలసీ కింద, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థను అయినా వెంటనే అడ్డుకుంటుంది’’ అని అమిత్ షా ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. మసరత్ ఆలం భట్ అధ్యక్షతన ఉన్న ఎంఎల్ జేకే -ఎంఏ భారత వ్యతిరేక,పాకిస్తాన్ అనుకూల ప్రచారంలో పాల్గొన్నందుకు దాన్ని నిషేధించారు.