MCD: బీజేపీ-ఆప్ కార్పొరేటర్ల కొట్లాట.. మళ్లీ వాయిదా పడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక

ఢిల్లీ మున్సిపాలిటీకి 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు. అయితే వారిని మొదటగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ సూచించారు. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన బీజేపీ నేత. దీన్ని ఆప్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మరొకవైపు సత్య శర్మ సూచనకు అనుకూలంగా బీజేపీ సభ్యులు నినాదాలు అందుకున్నారు

Election for Delhi Mayor postponed

MCD: ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక రెండవ సారి వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం జనవరి 6న మొదట ఎన్నిక నిర్వహించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ల మధ్య కొట్లాట ఏర్పడడంతో వాయిదా పడింది. ఇక తాజాగా ఇదే పరిస్థితి ఏర్పడిది. మరోసారి ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం తీవ్రమై కొట్లాట వరకూ వెళ్లింది. దీంతో మరోసారి ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ మంగళవారం ప్రకటించారు.

Rebels of ThupakulaGudem : ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 3న విడుదల

ఢిల్లీ మున్సిపాలిటీకి 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు. అయితే వారిని మొదటగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ సూచించారు. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన బీజేపీ నేత. దీన్ని ఆప్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మరొకవైపు సత్య శర్మ సూచనకు అనుకూలంగా బీజేపీ సభ్యులు నినాదాలు అందుకున్నారు. ఇరు వర్గాల పరస్పర నినాదాల అనంతరం సభలో కొట్లాట నెలకొంది. ఇరు పార్టీల వారు ఒకరికొకరు తోసుకున్నారు. దీంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది.

DCW Chief: మహిళలవైపో రేపిస్టులవైపో చెప్పండి.. హర్యానా సీఎంపై ఢిల్లీ మహిళా చీఫ్ సంచలన వ్యాఖ్యలు