ఈసీకి గజరాజుల సవాల్ : అటవీ శాఖతో చర్చలు 

గజరాజులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..

  • Publish Date - April 2, 2019 / 09:18 AM IST

గజరాజులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..

పశ్చిమబెంగాల్‌: గజరాజులు ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..

పశ్చిబెంగాల్ లోని నాలుగు నియోజకవర్గాల్లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 7,673 పోలింగ్‌స్టేషన్లు ఉండగా..వాటిలో 30 శాతం పోలింగ్‌స్టేషన్లు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో రాత్రి పగలు తేడా లేకుండా ఏనుగులు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏనుగుల సమస్యలను అధిగమించి ఎన్నికలను ఎలా నిర్వహించాలన్నది ఎన్నికల సిబ్బంది అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. 
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష

ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని బంకూరా, ఝార్‌గ్రామ్, మిడ్నాపూర్, బిష్ణుపూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏనుగుల సమస్య అధికంగా ఉంటుంది. అలాగే జార్ఖండ్‌లోని దాల్మా రేంజ్ పర్వత ప్రాంతాల నుంచి ఈ నియోజకవర్గాల పరిధిలోని అడవుల్లోకి ఏనుగులు వస్తాయి.

అలా వచ్చిన ఏనుగులు పంటల్ని..ఆస్తుల్ని ధ్వంసంచేయడం.. జనజీవితాన్ని అస్తవ్యస్తం చేయటం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా బిష్ణుపూర్ ప్రాంతంలో ఏనుగుల బెడద తీవ్ర సమస్యగా తయారయ్యింది. ఈ ఏనుగుల దాడిలో పలువురు చనిపోయారు. ప్రస్తుతం దాల్మా ప్రాంతానికి ఏనుగులు తిరిగి వెళ్లిపోయాయని.. కానీ అవి ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చని..వాటి వల్ల ఎప్పటికీ ప్రమాదం ఏ క్షణానైనా రావచ్చని అటవీశాఖ అధికారులు ఎన్నికల అధికారులకు తెలిపారు. దీంతో ఏనుగుల వల్ల ప్రమాదం తప్పదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వాహణలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా నిఘాను పటిష్ఠం చేసామని బెంగాల్ అటవీశాఖ మంత్రి కృష్ణ బర్మన్ తెలిపారు. 
Read Also : చెక్ బౌన్స్ కేసు : మోహన్ బాబుకి బెయిల్