Viral News : దీపావళి వేడుకల్లో జర్మన్ కొలీగ్‌కి కుర్తా ఆర్డర్ చేసిన ఉద్యోగులు.. స్పందించిన బ్లింకిట్ సీఈఓ

దీపావళి సందర్భంగా భారతదేశంలోని తమ కార్యాలయానికి వచ్చిన జర్మనీ కొలీగ్ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న అందరినీ చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అతని కోసం ఇక్కడి ఉద్యోగులు ఏం చేశారంటే?

Viral News

Viral News : జర్మనీ నుంచి ఇండియాకు వచ్చిన తమ కొలీగ్ కోసం ఆ ఆఫీస్ ఉద్యోగులు కుర్తా, పైజామా ఆర్డర్ ఇచ్చారు. పది అంటే పదే నిముషాల్లో డెలివరీ అయ్యింది. ఆశ్చర్యంగా ఉందా? ఇది ఎలా సాధమైంది?

Uttarakhand : పవన్ పాటకు స్టెప్పులు వేసిన ట్రైనీ ఐఏఎస్‌లు.. వీడియో వైరల్

డెబరున్ తాలుక్దార్ అనే ట్విట్టర్ యూజర్ తన ఆఫీస్‌లో జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇండియాలో తాలుక్దార్ పనిచేస్తున్న ఆఫీసుకి జర్మనీ నుంచి కొలీగ్ విచ్చేశారట. దీపావళి వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఆఫీసులో అందరూ కుర్తా ధరించడం చూసి ఆ జర్మన్ కొలీగ్ ఆశ్చర్యపోయారట. ఉద్యోగులందరికీ అతనికి కుర్తా కొనివ్వాలని అనిపించిందట. అస్సలు ఆలస్యం చేయకుండా జర్మన్ కొలీగ్ కోసం బ్లింకిట్ నుంచి కుర్తాను ఆర్డర్ చేసారు.

కుర్తాను ఆర్డర్ చేసిన 10 నిముషాల్లోనే ఆర్డర్ అందుకున్నారట ఉద్యోగులు. వెంటనే అది జర్మన్ కొలీగ్‌కి గిఫ్ట్ చేయడం ఆయన ధరించడం ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగిపోయింది. ఇదే విషయాన్ని తాలుక్దార్ ట్విట్టర్ లో ‘జర్మనీ నుండి నా సహోద్యోగి భారతదేశ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రతి ఒక్కరం సంప్రదాయబద్ధంగా కుర్తాను ధరించడం చూసి ఆశ్చర్యపోయారు. అందరూ అతను కూడా కుర్తా పైజామా ధరించాలని కోరుకున్నారు. బ్లింకిట్ నుండి 10 కంటే తక్కువ సమయంలో డెలివరీ చేయడం .. అమేజింగ్’ అంటూ పోస్ట్ చేశాడు.

Teacher Assault : బరితెగించిన స్కూల్ టీచర్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్

తాలుక్దార్ పోస్ట్ ఇంటర్నెట్ వినియోగదారుల్నే కాదు బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సాను ఆకర్షించింది. ‘మేము సహాయం చేయగలిగినందుకు సంతోషిస్తున్నామంటూ’ తాలుక్దార్ పోస్ట్‌కు రిప్లై చేశారు. ‘ఆఫీసుల్లో దీపావళి పార్టీలకు ఇప్పుడు కుర్తాలను ధరించకపోవడానికి కారణం తెలియడం లేదు’ అని కూడా బ్లింకిట్ చమత్కరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై నెటిజన్లు స్పందించారు.