Jammu And Kashmir Encounter : ఐదుగురు ఉగ్రవాదుల హతం

  • Publish Date - March 28, 2019 / 03:43 AM IST

ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. భారత సరిహద్దులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. భారత్‌లో ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు ట్రై చేస్తున్నారు. వీరిని భారత బలగాలు అడ్డుకుంటున్నాయి. ఎన్ కౌంటర్‌లో ఉగ్రవాదులను భారత ఆర్మీ హతమారుస్తోంది. తాజాగా షోపియాన్‌, హంద్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. 

షోపియాన్‌, హంద్వారాలో ఉగ్రవాదులు ప్రవేశించారని పక్కా సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, జమ్మూ పోలీసులు, ఆర్మీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. సైనికులు ఎదురపడగానే ఉగ్రవాదులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. ప్రతిగా సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. షోపియాన్‌లో ముగ్గురు, హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఘటనాస్థలంలో భారీగా మందుగుండు, ఇతర వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారా అనే అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మృతి చెందిన వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో తెలియాల్సి ఉంది.