Jammu kashmir Encounter : ప్రధాని మోదీ పర్యటనకు ముందు జమ్మూలో ఉగ్ర కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి

ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కిష్త్వార్‌లోని ఛత్రు ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నైద్ గామ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Jammu and Kashmir

Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లా ఛత్రు ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు జవాన్లు గాయపడ్డారు. అయితే, వీరిని ఛత్రు ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మరణించినట్లు వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. మరణించిన ఇద్దరు అరవింద్ సింగ్, విపిన్ కుమార్ లుగా గుర్తించారు.

Also Read : Hamza bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకు ఇంకా చావలేదు.. అల్‌ఖైదా నాయకత్వంతో దాడులకు ప్లాన్..!

అధికారిక వివరాల ప్రకారం.. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కిష్త్వార్‌లోని ఛత్రు ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నైద్ గామ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. మధ్యాహ్నం 3గంటల సమయంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే, జమ్మూకాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు కిష్త్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు కఠువా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.

Also Read : Video: చరిత్ర సృష్టించారు.. అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ సక్సెస్.. గ్రాండ్ సక్సెస్..

వాస్తవానికి జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఆయా పార్టీల అధిష్టాలను అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. ఎన్నికల సమావేశాలు, సభలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది. సెప్టెంబర్ 18న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ శనివారం పలు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. ఎన్నికల సమయంలో, మరీముఖ్యంగా ప్రధాని జమ్మూలో పర్యటిస్తున్న సమయంలో వరుస ఎన్ కౌంటర్లు చోటు చేసుకోటం గమనార్హం.