బెంగాల్ : బెంగాల్ టైగర్ మన జాతీయ జంతువు. ఉట్టిపడే రాజసం బెంగాల్ టైగర్ సొంతం. కళ్లలోని క్రౌర్యం, నడకలోని గాంభీర్యం చూస్తేనే వణుకు ఎంతటి ధైర్యశాలికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఇంత గొప్ప బెంగాల్ టైగర్ కు ఇప్పుడు బెంగాల్ టైగర్ ఆవాసాలు అంతకంతకు కుచించుకుపోతున్నాయి. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ల్లో విస్తరించిన సుందర్‌బన్ అడవులు బెంగాల్ ట్రైగర్ స్వస్థలం. ఇప్పటికే అంతరించే స్థాయికి చేరుకున్న ఈ పులులు వచ్చే 50 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందట.
ప్రపంచంలోనే అతి పెద్ద మడ అడవులైనా ఈ సుందర్ బన్ అడవులు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవుల్లో ప్రస్తుతం 4వేల పులులు జీవిస్తున్నాయి. అయితే, వాతావరణ మార్పులతో సుందర్‌బన్ అడవులు 2070 నాటికి అదృశ్యం అవుతాయని, ఆ అడవుల్లోని బెంగాల్ పులులు, ఇతర జాతులు అంతరించిపోతాయని ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ కుక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాటిని కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి ఇప్పటికైనా భారతదేశపు జంతువు అయిన బెంగాల్ ట్రైగర్ ఆవాసాలైన ఈ సుందర్ బన్ అడవుల సంరక్షణ కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.