కరోనా వ్యాధి ప్రబలుతోంది. వేలాది మందిని పొట్టన పెట్టకొంటోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకొంటున్నాయి. ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అత్యవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాదారులు నగదు ఉపసంహరించుకొనేందుకే కేంద్ర కార్మిక శాఖ ఛాన్స్ కల్పించిన సంగతి తెలిసిందే.
తాజాగా శుక్రవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగి మూడు నెలల మూల వేతనం, డీఏ, లేదా కనీస నిల్వ నుంచి 75 శాతం వరకు తీసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మొత్తంలో ఏది తక్కువైతే..ఆ మొత్తం చెల్లిస్తుంది. అవసరమైన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది.
* కరోనా రిలీఫ్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
* మొత్తం లక్షా 70వేల కోట్లను ప్యాకేజీని ప్రకటించింది.
* వైద్య,ఆరోగ్య, పారిశుథ్య కార్మికులు, పారామెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లకు కలిపి 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ప్రకటించింది.
* వలస కూలీలు, రోజువారీ కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం వెల్లడించింది.
* ఉద్యోగుల భవిష్యనిధి (EPF) కింద ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీస్ షేర్ రెండింటిని వచ్చే * మూడు నెలల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్రం ప్రకటించింది.
* రూ.15వేల లోపు జీతం ఉండి వంద లోపు ఉద్యోగులున్న సంస్థలకే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది.