EPF Wage Limit: ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్.. పిఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. రేపటి నుంచే అమల్లోకి!

EPFO పరిధిలోకి వచ్చే ఉద్యోగుల తప్పనిసరి వేతన పరిమితిని (EPF Wage Limit) పెంచుతూ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Epfo wage ceiling limit increased to 25000 modi cabinet decision

  • పిఎఫ్ పరిమితి రూ.25 వేలు
  • 51 లక్షల మందికి లబ్ధి
  • రేపటి నుంచే అమల్లోకి

EPF Wage Limit: దేశంలోని వేలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (PF Wage Limit) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల తప్పనిసరి వేతన పరిమితిని పెంచుతూ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.15,000గా ఉన్న పీఎఫ్ వేతన పరిమితిని ఏకంగా రూ. 25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు నేరుగా సామాజిక భద్రతా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

Read Also – CM Revanth Reddy: కేసీఆర్ ఫామ్‌హౌస్‌ 340 ఎకరాలు.. గజం భూమి కూడా వదలం.. ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశాలు!

వేతన పరిమితి పెంపునకు గల కారణాలు ఇవే:

చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో ఈ వేతన పరిమితిని రూ. 15,000గా నిర్ణయించారు. అయితే పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, రాష్ట్రాల్లో అన్-స్కిల్డ్ కనీస వేతనాలు రూ. 15 వేలు దాటడంతో ఈ మార్పు తప్పనిసరి అయింది. మోడీ ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీని విస్తరించే లక్ష్యంతో జీతాల పెరుగుదలకు అనుగుణంగా ఈ పాత క్యాప్‌ను రూ. 25,000కు పెంచుతూ ఆమోదముద్ర వేసింది.

ఉద్యోగులకు అందే ప్రయోజనాలు & అమలు:

రూ. 15,000 నుండి రూ. 25,000 మధ్య జీతం పొందే వారు ఇకపై ఆటోమేటిక్‌గా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. వీరికి పీఎఫ్ పొదుపుతో పాటు పెన్షన్ (EPS), ఇన్సూరెన్స్ (EDLI) ప్రయోజనాలు లభిస్తాయి. దీని కోసం ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 56,696 కోట్లు వెచ్చించనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుండటంతో, కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతకు రిటైర్మెంట్ భద్రత దక్కనుంది.