CM Revanth Reddy: కేసీఆర్ ఫామ్‌హౌస్ 340 ఎకరాలు.. గజం భూమి కూడా వదలం.. ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశాలు!
తెలంగాణ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ప్రతిపక్ష బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Cm revanth reddy shocking comments kcr erravelli farmhouse
- ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై రేవంత్ షాక్
- ప్రైవేట్ భూముల రికవరీకి సిద్ధం
- అసెంబ్లీలో కేసీఆర్ భూముల లెక్కలు
CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్ష బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను ఎండగట్టిన సీఎం, కేసీఆర్ కుటుంబానికి చెందిన భూముల లెక్కలను సభ ముందు ఉంచారు. ఇదే క్రమంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. ధరణి పేరుతో పేదల భూములను లాక్కొని సొంతం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సంచలన కామెంట్స్:
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ప్రాంతం కూడా ప్రైవేట్ భూమికి సంబంధించినదేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. 340 ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫాం హౌస్ పరిధిలో ఉందని చెప్పిన సీఎం అక్రమంగా సంపాదించిన లేదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంగుళం భూమిని వెనక్కి రికవరీ చేస్తామనే సంకేతాలను ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై కూడా చట్టపరమైన చర్యలు తప్పవనే చర్చ జోరందుకుంది.
ప్రభుత్వ భూముల రికవరీకి సిద్ధం:
గతంలో ప్రభుత్వ భూములను అక్రమంగా బదిలీ చేసుకున్న వారిపై చర్యలు తప్పవని, ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరుపుతామని సీఎం తేల్చి చెప్పారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై సర్కార్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
