YSRCP : వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం.. పార్టీ నుంచి మోపిదేవి శ్రీనివాసరావు సస్పెండ్.. ఐదు నెలలకే వేటు
Repalle Ysrcp Leader Mopidevi Srinivasa Rao : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మోపిదేవి శ్రీనివాసరావును సస్పెండ్ చేసింది.
Repalle Ysrcp Leader Mopidevi Srinivasa Rao
Repalle Ysrcp Leader Mopidevi Srinivasa Rao Suspended : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మోపిదేవి శ్రీనివాసరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లేఖ విడుదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో తెలిపింది.
మోపిదేవి శ్రీనివాసరావు ఐదు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరికొందరు అనుచరులుకూడా ఆ సమయంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన కొద్దికాలం సమయంలోనే ఆయన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రేపల్లె నియోజకవర్గంలో చర్చనీయంగా మారింది. రేపల్లె నియోజకవర్గంలో వైసీపీలో శ్రీనివాసరావు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారని.. ఎమ్మెల్యే టికెట్ తనకేనంటూ ప్రచారం చేసుకుంటున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులపై విచారణ అనంతరం ఆయన్ను సస్పెండ్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది.
