Bigg Boss Telugu Today Promo : అమన్ని తప్పించిన ముకేశ్.. ఫస్ట్ టైం గొడవపడ్డ అగ్నిపరీక్ష బ్యాచ్.. జంతువుల్లా నటించిన కంటెండర్స్.. బిగ్ బాస్ ప్రోమో..
నిన్నటి ఎపిసోడ్ లోనే అమన్ శాలినితో మనం ఒక గ్రూప్ కదా అనుకోని... తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. (Bigg Boss Today Promo)
Bigg Boss Telugu 10 Day 10 Today Promo 1
Bigg Boss Today Promo : నిన్నటి నుంచి కెప్టెన్సీ కోసం పలు టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ అవ్వడానికి అందరూ ట్రై చేస్తున్నారు. నిన్న పెట్టిన ఓ టాస్క్ లో ఝాన్సీ, ముకేశ్, అమన్, షాలిని లు నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.
నిన్న కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన రౌండ్ లో గెలిచిన నలుగురికి ఇవాళ బిగ్ బాస్ ఇద్దరిద్దర్ని డివైడ్ చేసి యానిమల్స్ చూపించి యాక్ట్ చేస్తే ఇంకొకరు ఆ యానిమల్ ఏంటో గుర్తుపట్టి యానిమల్ బాక్స్ లను అమర్చాలి. ఝాన్సీ – ముకేశ్ ఒక జంటగా, అమన్ – షాలిని ఒక జంటగా ఆడారు. ఇందులో ఝాన్సీ – ముకేశ్ గెలిచారు. వీళ్ళకు వేరే ఇద్దరిలో ఒకర్ని కెప్టెన్సీ గేమ్ నుంచి తప్పించే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. దాంతో ముకేశ్ అమన్ ని తప్పించాడు.
Also Read – Prerana Kambam : తల్లి కాబోతున్న బిగ్ బాస్ భామ.. బేబీ బంప్ చూపిస్తూ..
అయితే అమన్ – షాలిని నువ్వు సరిగ్గా ఆడలేదు, నువ్వు సరిగ్గా ఆడలేదు అని తిట్టుకున్నారు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవే అయింది. ఇన్నాళ్లు కలిసి గ్రూప్ గా ఆడుతున్న అగ్నిపరీక్ష బ్యాచ్ లో మొదటిసారి గొడవ పడ్డారు. పైగా నిన్నటి ఎపిసోడ్ లోనే అమన్ శాలినితో మనం ఒక గ్రూప్ కదా అనుకోని ఇవాళ తిట్టుకోవడం గమనార్హం. మీరు కూడా లేటెస్ట్ ప్రోమో చూసేయండి..
