Aasmaan Teaser : శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ చూసారా?
మీరు కూడా ఆస్మాన్ టీజర్ చూసేయండి..(Aasmaan Teaser)
Aasmaan Teaser
Aasmaan Teaser : శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా, రాయంచ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఆస్మాన్’. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మాణంలో రామ్ నందన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నేడు ఈ సినిమా టీజర్ ని మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో సైకలాజికల్ థ్రిల్లర్ లా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్మాన్ సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also See : Serial Actress Lavanya : ఇల్లు ఇల్లాలు ప్రియురాలు సీరియల్ నటి ‘లావణ్య’ సీమంతం వేడుకలు.. ఫోటోలు..
మీరు కూడా ఆస్మాన్ టీజర్ చూసేయండి..
టీజర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. నా తమ్ముడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ కోసం రావడం ఆనందంగా ఉంది. శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు. నేను మేఘాంశ్‌ని ఎత్తుకున్నాను. సినిమా ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి గారు ఉంటారు. మేఘాంశ్‌ని నేను ఎలా చూడాలని అనుకున్నానో టీజర్లో అలా కనిపించాడు అని అన్నారు. మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. ఆస్మాన్ కోసం వచ్చిన మనోజ్ అన్నకి, శివాత్మికకు థాంక్స్. ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూ చేశాను. రామ్ నందన్ ఈ సినిమాని గొప్ప స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. అది నా ప్రామిస్ అని అన్నారు.

శివాత్మిక మాట్లాడుతూ.. ఆస్మాన్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, మేఘాంశ్ డైలాగ్స్ బాగున్నాయి. మేఘాంశ్ నా స్కూల్లో సీనియర్ అని చెప్పారు. దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. టీజర్ లోనే చాలా వరకు రివీల్ చేశాను. మా హీరో మేఘాంశ్‌కి టాలెంట్‌తో పాటు డెడికేషన్ ఉంది. సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక మిస్టరీ ఇస్తూనే ఉంటాం అని అన్నారు. నిర్మాత వెంకటేష్ కొండారు మాట్లాడుతూ.. మేం చెప్పాలన్నకున్నదంతా ‘ఆస్మాన్’ టీజర్ రూపంలో చెప్పేశాం. శ్రీహరి గారి ఫ్యామిలీతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు.
