కేంద్రం లవ్ జిహాద్‌పై చట్టం రావాలని కోరుకుంటుంది: హర్యానా సీఎం

కేంద్రం లవ్ జిహాద్‌పై చట్టం రావాలని కోరుకుంటుంది: హర్యానా సీఎం

Updated On : November 1, 2020 / 6:29 PM IST

Love Jihad: కేంద్రం లవ్ జిహాద్ కేసులపై చట్టం రావాలని కోరుకుంటుందని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం అన్నారు. కఠినమైన చట్టం తీసుకొచ్చి మన అక్కచెల్లెళ్లుతో ఆడుకునే వాళ్లకు ఇది వణుకు పుట్టిస్తుంది అని యోగి ఆదిత్యనాథ్ చెప్పిన తర్వాత లాల్ కట్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తమ రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకుంటున్నామని ఈ విషయంలో ఏ అమాయకపు వ్యక్తికి శిక్ష పడదని అన్నారు.

‘బల్లాభ్‌ఘర్ కేసుకు లవ్ జిహాద్ తో ముడిపడి ఉందని తెలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో జోక్యం చేసుకుంది. తప్పు చేసిన వాళ్లు ఇందులో నుంచి తప్పించుకోలేరు. అదే సమయంలో ఏ అమాయక వ్యక్తికి శిక్షపడదు’ అని ఖట్టర్ అన్నారు.



హర్యానాలోని ఫరీదాబాద్‌లో అక్టోబరు 26న 21ఏళ్ల వయస్సున్న యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపారు. తౌసిఫ్, రెహాన్ అనే ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు.

హర్యానా సీఎం కామెంట్ చేసిన తర్వాత హోం మినిష్టర్ అనిల్ విజ్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. లవ్ జిహాద్ అనే దానిని తప్పక సెట్ చేయాల్సి ఉంది. అలా మన అమ్మాయిలను కాపాడుకోవచ్చు. దీనికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తే.. లేదా దానికి సమానమైనది ఏమైనా చేస్తే మనం సాధించగలం’ అని హోం మినిష్టర్ అన్నారు.

హర్యానా అసెంబ్లీ సెషన్ నవంబర్ 5న జరగనుండగా ఆ సమయానికి దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ‘లవ్ జిహాద్ అనేది ముస్లిం యువకులు, హిందూ యువతులు మధ్య సంబంధాలతో ముడిపడి ఉంది. బలవంతంగా వారిని మతమార్పిడి చేయడం వంటివి జరుగుతున్నాయి.