Every Person Need Not Be Vaccinated Against Coronavirus1
Harsh Vardhan: కరోనా వైరస్ పై పోరాడేందుకు ఇండియాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాల్సిన అవసర్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్దన్ అంటున్నారు. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ లో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ను భాగం చేయలేమని పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.
సైంటిఫికల్ గా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడం తప్పనిసరేం కాదు. ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ వేయడం సులభం కాదు. అని లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ వేయడానికి ప్రాధాన్యత, వైరస్ ప్రవర్తన డైనమిక్ గా ఉంటాయి. అన్ని విషయాలు సైంటిఫిక్ అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ఎన్సీపీ మెంబర్ సుప్రియ సులె మంత్రిని యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇన్వాల్స్ చేశారా అని ప్రశ్నించారు. దానిపై స్పందించిన మినిష్టర్ .. ప్రతి వ్యాక్సిన్ కు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియా దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచుకుంటూ పోతుంది.
ప్రియారిటీని బట్టి.. వ్యాక్సినేషన్ చేస్తాం. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఆ తర్వాత సీనియర్ సిటీజన్లు, 45 నుంచి 59ఏళ్లు మధ్య వయస్కులకు నిపుణుల అభిప్రాయం తీసుకుని వ్యాక్సిన్ వేస్తామని వెల్లడించారు.