Om Bnirla
Lok Sabha Speaker Om Birla: జీవితంలో ఎలాంటి సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉందంటున్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ‘ఎవరైతే వ్యక్తి భగవద్గీత ఆధారంగా వారి జీవితాన్ని గడుపుతారో వాళ్లు సరైన మార్గంలో గడుపుతారు. ఎలాంటి సమస్య నుంచైనా బయటపడతారు’
‘తెలివిగా బతకడానికి గీత ప్రేరణనిస్తుంది. కర్మసిద్ధాంతంలో ప్రయాణించేందుకు దారిని చూపిస్తుంది. యువకులు బతకడంలో కళను నేర్చుకోవాలి. గీతతో కనెక్ట్ అయి జీవితాలను సమాజం కోసం, దేశం కోసం అంకితం చేయాలి’ అని ప్రసంగించారు ఓం బిర్లా.
గీతా గ్యాన్ సంస్థానంలో స్వామి గ్యానానంద్ జీ మహారాజ్ రాసిన పుస్తకాలను ఓం బిర్లా చేతుల మీదుగా విడుదల చేశారు. ‘ఈ పుస్తకాల ద్వారా మతం, ఆధ్యాత్మికత కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుందనుకుంటున్నా. సమాజంలో యువతకు కొత్త ప్రేరణ కలుగుతుందని భావిస్తున్నా’ అని అన్నారు. ఇదే పర్యటనలో బిర్లా.. పవిత్రమైన బ్రహ్మసరోవర్ మహా హారతిలోనూ పాల్గొన్నారు.
………………………………….: ‘కోహ్లీ ఫోన్ స్విచాఫ్ ఉంది.. గంగూలీ స్టేట్మెంట్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది’
कुरुक्षेत्र प्रवास के दौरान राष्ट्रीय युवा चेतना समारोह को संबोधित किया। गीता हमें कर्म की प्रेरणा देती है। गीता हमें कर्तव्य मार्ग पर आगे बढ़ने की दिशा दिखाती है। युवा स्वयं को गीता से जोड़कर जीवन जीने की कला सीखें तथा समाज तथा देश के कल्याण में स्वयं को समर्पित करें। pic.twitter.com/Qzd86Wm9Z3
— Om Birla (@ombirlakota) December 11, 2021