గాడిదలకు హీరోల పేర్లు : EVM ల రవాణా

  • Publish Date - April 18, 2019 / 07:17 AM IST

ఆ గాడిదలకు స్టార్ సినిమా హీరోల పేర్లు పెట్టారు. అంతేనా ఆ గాడిదతోనే ఎన్నికల మిషన్లు ఈవీఎంలను మోయించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు  ఈసీ అధికారులు. మరేం చేస్తారు చెప్పండి. రోడ్డులే లేని ప్రాంతమాయె. మరి రోడ్డు లేకుంటే వాహనాలు ఎలా నడుస్తాయి చెప్పండి. అందుకే EVM లను పోలింగ్ కేంద్రాలకు మోసుకెళ్లేందుకు ఈ హీరోలను (హీరోల పేర్లు పెట్టిన గాడిద)లపై EVMలను మోసుకెళ్లారు. ఇది  త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలోని పెన్న‌గార‌మ్ నియోజ‌క‌వ‌ర్గంలో చోటుచేసుకున్న దృశ్యం. 

ఈ ప్రాంతంలో జరగాల్సిన  ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల సంఘం అధికారులు గాడిద‌ల‌్నే వాహనాలుగా వినియోగిస్తు EVM ల‌ను మోసుకువెళ్లేందుకు నాలుగు గాడిద‌ల‌ను ఈసీ అధికారులు కిరాయి తీసుకున్నారు. హైవేకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఆ ఊరికి వాహ‌నాలు వెళ్ల‌నే వెళ్లవు. అందుకోసం EVMల‌ను మోసుకెళ్లేందుకు గాడిద‌ల‌ను వాడాల్సి వ‌చ్చింది. ఆ ఊరిలో సుమారు 341 ఓట‌ర్లు ఉన్న‌ారు. ఈవీఎంల‌ను మోసుకెళ్లిన గాడిద‌ల‌కు సినిమా హీరోల పేర్లు పెట్టారు. ర‌జ‌నీ, క‌మ‌ల్‌, అజిత్‌, విజ‌య్ అని వాటికి పేర్లు కూడా పెట్టారు. 

 చిన్న‌స్వామి అనే వ్య‌క్తికి చెందిన గాడిద‌లు ఈవీఎంను ఇలా మోసుకెళ్లాయి. 1970 నుంచి ఆ గ్రామానికి గాడిద‌ల ద్వారానే ఎన్నిక‌ల సామాగ్రిని మోసుకువెళ్తున్న‌ట్లు చినస్వామి తెలిపాడు. రోజూ ఒక గాడిద‌కు 2వేలు ఇస్తున్నారని కూడా చినస్వామి చెప్పాడు. 
 

ట్రెండింగ్ వార్తలు