Ex Kerala CM Oommen Chandy gets clean chit in sexual exploitation case
Oommen Chandy: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఊరట లభించింది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో ఆయనకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయమై కోర్టుకు మంగళవారం రిఫరల్ రిపోర్టును పంపింది సీబీఐ. ఉద్దేశపూర్వక కుట్రలో భాగంగానే చాందీపై సదరు మహిళ కేసు నమోదు చేసిందని, వాస్తవానికి చాందీ ఇంటికి ఆమె వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో సీబీఐ పేర్కొంది.
సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో తనను లైంగికంగా వేధిస్తున్నారని ఉమెన్ చాందీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సహా మరో ఐదుగురిపై 2013 జూలైలో ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలోని పినరయి విజయన్ ప్రభుత్వం 2021లో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే సీబీఐ తాజా రిపోర్టులో ఆయనకు క్లీన్ చిట్ రావడంతో.. విజయన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలకు దిగింది. సీఎం విజయన్‌పై వస్తున్న బంగారం స్మగ్లింగ్ ఆరోపణల కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Sanjay Raut: వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్ధవ్ థాకరే గురంచి పుతిన్, బైడెన్, కింగ్ చార్లెస్ చర్చించారట!