Gangster Suresh Pujari : ఫిలిప్పీన్స్​ నుంచి భారత్​ కు మోస్ట్ వాంటెడ్ సురేశ్​ పూజారి..10 రోజుల రిమాండ్

మోస్ట్​వాంటెడ్​ గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్​ నుంచి భారత్​కు తీసుకొచ్చారు అధికారులు. ఆ తర్వాత మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం తమ కస్టడీలోకి

Pujari

Gangster Suresh Pujari :  మోస్ట్​వాంటెడ్​ గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్​ నుంచి భారత్​కు తీసుకొచ్చారు అధికారులు. ఆ తర్వాత మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం తమ కస్టడీలోకి తీసుకుని ముంబయికి తరలించింది. మహారాష్ట్ర, కర్ణాటకలో నమోదైన పలు దోపిడీ కేసుల్లో 15 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు సురేశ్​ పూజారి.

మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దోపిడీ కేసుల్లో మోస్ట్​ వాంటెడ్​, 15 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్​ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు అధికారులు. ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత మొదటగా.. ఐబీ, సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం(ATS) సురేశ్​ పూజారిని తమ కస్టడీలోకి తీసుకుంది. అక్కడి నుంచి బుధవారం ఉదయం ఫ్లైట్ లో ముంబైకి తీసుకొచ్చారు.

పూజారిని బుధవారం ఉదయం ఏటీఎస్ థానేలోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేల్ కోర్టు ముందు హార్చగా.. కళ్యాన్ లోని ఫౌలే పోలీస్ స్టేషన్ లో నమోదైన దోపీడీ కేసులో డిసెంబర్25వరకు అతడిని ఏటీఎస్ రిమాండ్ కు అప్పగించింది కోర్టు.

కాగా,15 ఏళ్లుగా పరారీలో ఉన్న పూజారిని గత అక్టోబర్​లో ఫిలిప్పీన్స్​లో పట్టుకున్నారు. ఒక్క థాణెలోనే అతనిపై 23 దోపిడీ కేసులు నమోదయ్యాయి. గ్యాంగ్​స్టర్​ రవి పూజారికి..సురేశ్​ పూజారి అత్యంత దగ్గరి బంధువు. 2007లో అతని నుంచి వేరుపడి సొంతగా గ్యాంగ్​ను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడ్డాడు. అండర్​వరల్డ్​ డాన్​ చోటా రాజన్​తోనూ కలిసి పని చేశాడు. ముంబై, ఠాణె, కళ్యాన్​, ఉల్హాస్​నగర్​, దోంబివలిలో నమోదైన పలు దోపిడీ కేసుల్లో పూజారి మోస్ట్​వాంటెడ్​. ఈ క్రమంలో 2017, 2018 రెడ్​ కార్నర్​ నోటీసులు ఇచ్చారు ముంబై,థానే పోలీసులు. మహారాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు.. ఠాణెలో పూజారిపై నమోదైన కేసులన్నింటినీ రాష్ట్ర ఏటీఎస్​కు బదిలీ చేశారు.

ALSO READ Semiconductor : సెమీకండక్టర్ల డిజైన్,తయారీ ప్రాజెక్టుకు రూ.76 వేల కోట్లు..కేబినెట్ నిర్ణయంపై మోదీ ట్వీట్