‘ఫణి’ తుఫాన్ : కేరళలో  రెడ్ అలర్ట్  

  • Publish Date - April 26, 2019 / 06:54 AM IST

ఏపీకి ‘ఫణి’ తుఫాన్ ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావం కేరళ రాష్ట్రంపై కూడా పడే ఉన్న క్రమంలో కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2018లో వచ్చిన వరదలకు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ‘ఫణి’ తుఫాన్ ప్రభావం చసపిస్తుందనే భయంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. 

మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని తీరప్రాంతాల్లో కేరళ సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. ఫణి తుపాన్ వల్ల గంటలకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేరళ సముద్ర తీరంలోని వలియాథుర గ్రామంలో మూడువేల మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఫణి తుపాన్ హెచ్చరికల దృష్ట్యా మత్స్యకారులు మే 1వతేదీ వరకు సముద్రంలోకి వెళ్లవద్దని ప్రసార సాధనాల ద్వార హెచ్చరికలు జారీ చేశారు. 
Also Read : లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక