Kangana Ranaut
Farmers blocked Kangana Ranaut : రైతుల ఆందోళనపై కామెంట్ చేసినందుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ పర్యటనకు వెళ్లిన కంగనాను రైతులు అడ్డుకున్నారు. రైతులపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న కీరత్‌పూర్ సాహిబ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, కాసేపటికే అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెప్పారు. దీంతో అక్కడి నుంచి కంగన వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పంజాబ్ పోలీసులకు కంగన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పంజాబ్‌లోకి ఎంటర్ అయిన తన కారుపై పెద్ద సంఖ్యలో మూకుమ్మడిగా వచ్చి దాడి చేశారన్నారు కంగనా. వారంతా రైతులేనని చెప్పారు. తన కారుని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాను రాజకీయ నేతను కాదన్న కంగనా…… ఇదేం దౌర్జన్యమంటూ అసహనం వ్యక్తం చేశారు. తన వెంట సెక్యూరిటీ లేకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అక్కడ పోలీసులున్నప్పటికీ తనని కదలనీయలేదన్నారు.
Omicron Tension : దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్ పోటీల్లో ఒమిక్రాన్ కలవరం
నోటికొచ్చినట్లు రైతులు తిట్టారన్నారు. రైతు నిరసనలపై తాను పోస్టులు చేసినప్పటి నుంచి నిరంతరం తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు కంగనా. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు.తనను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎంకు సూచించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆమె విజ్ఞప్తి చేశారు.