Farmers
Farmers Protest : రేపు ఉదయం 10 గంటలకు సింఘు సరిహద్దులో సమావేశం కానున్నారు సంయుక్త కిసాన్ మోర్చా రైతు నేతలు. మూడు రైతు చట్టాల ఉపసంహరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీలో ఇన్ని నెలలుగా ఉద్యమిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అందరూ పాల్గొనబోతున్నారు.
Tirumala : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు తొలగింపు.. వాహనాలకు అనుమతి
ప్రధానమంత్రి ప్రకటన వెలువడిన వెంటనే సమావేశం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు భావించారు. ఐతే.. కొందరు రైతు సంఘం నేతలు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ ను రేపటికి వాయిదా వేశారు. శనివారం సింఘు బోర్డర్ కు రావాలని ఇప్పటికే అన్ని సంఘాల నాయకులకు సమాచారం వెళ్లిందని కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు.
“ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ముగిసిపోలేదు. వ్యవసాయ చట్టాలని పార్లమెంట్ లో రద్దు చేసే వరకు.., పంటల మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించే వరకు రైతు ఉద్యమం కొనసాగుతుంది. పంటల మద్దతు ధరకు కేంద్రం గ్యారెంటీ ఇవ్వాలి. ఏ ఒక్క రైతు కూడా తన పంటను మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేదు. ప్రజలు కేంద్రం నిర్ణయం పట్ల సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం, లడ్డూ మిఠాయిలు పంచుకోవాల్సిన అవసరం లేదు. మా పోరాటం కొనసాగుతుంది. సింఘు సరిహద్దులో 9 మంది సభ్యుల సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తుంది” అని రైతు సంఘం అగ్ర నాయకుడు రాకేశ్ టికైట్ చెప్పారు.
US COVID Booster Dose : అమెరికా కీలక ప్రకటన.. వారందరికి కొవిడ్ బూస్టర్ మస్ట్..!