Tirumala : తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు తొలగింపు.. వాహనాలకు అనుమతి

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియల తొలగింపు పనులు పూర్తి అయ్యాయి. రోడ్డు శుభ్రం చేసి వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు.

Tirumala : తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు తొలగింపు.. వాహనాలకు అనుమతి

Tirumala (1)

Tirumala Second Ghat Road : తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియల తొలగింపు పనులు పూర్తి అయ్యాయి. రోడ్డు శుభ్రం చేసి వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు. భారీ వర్షం కారణంగా నిన్న తిరుమల రెండోఘాట్‌ రోడ్డును టీటీడీ అధికారులు మూసివేశారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో… మరమ్మతు పనులు పూర్తిచేశారు. మరోవైపు భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని భక్తులు అందోళనకు గురికావొద్దన్న టీటీడీ.. వర్షం తగ్గేవరకూ భక్తులు గదుల్లోనే ఉండాలని సూచించింది.

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొందరు ఇతర ప్రాంతాల్లో తీసిన వీడియోలను తిరుమలలో తీసినట్లు ప్రచారం చేస్తున్నారని, తిరుమల వరదలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఫేక్ వీడియోలను నమ్మొద్దని ఈవో జవహర్ రెడ్డి కోరారు. తిరుమలలో ఉన్న భక్తులు భయాందోళనకు గురికావద్దన్నారు.

Chitravati River : చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మంది సేఫ్.. హెలికాప్టర్‌ సహాయంతో కాపాడిన రెస్క్యూ టీమ్‌

తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేశామన్నారు. భారీ వర్షాల కారణంగా తిరుమల రెండు ఘాట్ రోడ్లలో దాదాపు పది ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండవ ఘాట్ రోడ్ లో కొండచరియల తొలగింపు పనులు పూర్తయ్యాయని ఈవో తెలిపారు. రోడ్డు శుభ్రం చేసిన తర్వాత వాహనాలను అనుమతిస్తున్నట్టు చెప్పారు.