Chitravati River : చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మంది సేఫ్.. హెలికాప్టర్‌ సహాయంతో కాపాడిన రెస్క్యూ టీమ్‌

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్‌ సహాయంతో కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Chitravati River : చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మంది సేఫ్.. హెలికాప్టర్‌ సహాయంతో కాపాడిన రెస్క్యూ టీమ్‌

Rescue

Heavy rains in Anantapur : ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. తిరుపతి జలదిగ్బంధంలో ఉంది. 70 శాతం కాలనీలు ముంపుకు గురయ్యాయి.

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్‌ సహాయంతో కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నదిలో చిక్కుకున్న సమయంలో వరద ఉధృతికి కొట్టుకుపోతామేమోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు.

Mylavaram Dam : కడప జిల్లాలో భారీ వర్షాలు..మైలవరం డ్యామ్‌కు డేంజర్ బెల్స్

తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హెలికాప్టర్‌ను చూసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఒడ్డుకు చేరిన తర్వాత వారి మనసు కుదుటపడింది. చిత్రావతి నదిలో చిక్కుకున్న 11 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్‌ను జిల్లా కలెక్టర్‌, ఎస్పీ అభినందించారు.

కడప జిల్లా రామాపురం వద్ద వాగులో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో చిక్కుకున్న ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. నెల్లూరు జిల్లా సోమశిల వద్ద సోమేశ్వర ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది.