Mylavaram Dam : కడప జిల్లాలో భారీ వర్షాలు..మైలవరం డ్యామ్‌కు డేంజర్ బెల్స్

కడప జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైలవరం డ్యాంకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చరిత్రలో తొలిసారి గండికోట జలాశయం నుంచి మైలవరంకు 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.

Mylavaram Dam : కడప జిల్లాలో భారీ వర్షాలు..మైలవరం డ్యామ్‌కు డేంజర్ బెల్స్

Project

Heavy rains in Kadapa district : కడప జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైలవరం డ్యాంకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చరిత్రలో మొదటిసారిగా గండికోట జలాశయం నుంచి మైలవరంకు 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. మైలవరం నుంచి పెన్నానదికి 11 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గండికోటలో పూర్తి స్థాయి నీటి మట్టం..26.85 టీఎంసీలు. పెన్నా, కుందూ నది పరివాహక ప్రాంతాలైన జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు ముప్పు పొంచి ఉంది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భారీ వర్షాలతో కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. మొత్తం 1200 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. గరిష్ట నీటిమట్టం 4.148 టీఎంసీలకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిఎన్‌యస్‌యస్ కాలువ ద్వారా కడప జిల్లా గండికోట రిజర్వాయర్ కు 250 క్యూసెక్కుల నీటిని, పంట సాగుకు యస్‌ఆర్‌బీసీ కాలువ ద్వారా 350 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

Heavy Rains : కడప జిల్లాలో వర్ష బీభత్సం..జలదిగ్బంధంలో గ్రామాలు..నీట మునిగిన పంటలు

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లా అతాలకుతలం అవుతోంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. పలు గ్రామాలు జలదిగ్బందంలో ఉన్నాయి. రైల్వేకోడూరులోని గుంజనేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గుంజనేరు వరద ధాటికి 20 ఇళ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు రాజంపేటలో వరదలో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. బస్సు ప్రమాదంలో 12 మంది ప్రయాణీకులను రెస్క్యూ టీమ్ రక్షించింది. ఇప్పటివరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి.

కడప జిల్లాలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహంలో మునిగి మందపల్లి, పులపుత్తూరులో 50 మంది మృతి చెందినట్లు ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి తెలిపారు. 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. వరద కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి తెలిపారు.