US COVID Booster Dose : అమెరికా కీలక ప్రకటన.. వారందరికి కొవిడ్ బూస్టర్ మస్ట్..!

అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై పెద్దవారందరికి కొవిడ్ బూస్టర్ తప్పనిసరి చేసింది.

US COVID Booster Dose : అమెరికా కీలక ప్రకటన.. వారందరికి కొవిడ్ బూస్టర్ మస్ట్..!

Covid Booster Shot

US COVID Booster Dose : అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై పెద్దవారందరికి కొవిడ్ బూస్టర్ తప్పనిసరి చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. అమెరికాలోని ప్రతి పెద్దవారికి ఫైజర్, మోడెర్నా (Pfizer, Moderna) కరోనా టీకా బూస్టర్ డోసులను అందించనుంది. ఈ రెండు వ్యాక్సిన్లకు 18ఏళ్ల నుంచి ఆ పైబడిన వారందరికి బూస్టర్ డోసు వేసేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.

గతంలో ఈ బూస్టర్ షాట్ లను రోగనిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ 65ఏళ్లు పైబడినవారితో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మాత్రమే ఈ బూస్టర్ అందించేవారు. ఇప్పుడు ఈ బూస్టర్ మోతాదును ఫైజర్ లేదా మోడెర్నా కరోనా టీకాను ప్రారంభ మోతాదు తర్వాత 6 నెలల వరకు తీసుకోవచ్చు. 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా అమెరికా పౌరులు ఈ బూస్టర్ మోతాదును తీసుకోవచ్చు.

ఈ నిర్ణయంతో కరోనా నుంచి రక్షణ అందించడమే కాకుండా ఆస్పత్రి, మరణ ముప్పును తగ్గించడంలో సాయపడుతుందని ఎఫ్డీఏ కమిషనర్ Janet Woodcock పేర్కొన్నారు. మరోవైపు.. మోడెర్నా CEO స్టీఫెన్ బన్సెల్ మాట్లాడుతూ.. ‘మనం ఇప్పుడు శీతాకాలం వైపు వెళ్తున్నాం. అమెరికా అంతటా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా బాధితుల అడ్మిషన్లు పెరిగిపోతున్నాయి. గతంలోనూ అమెరికాలో కరోనా టీకా బూస్టర్ డోస్ ఇవ్వడం జరిగింది. 65 ఏళ్లు పైబడిన వారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ బూస్టర్ డోస్‌ను అందించారు.


అలాగే ప్రమాదకర వృత్తులలో పనిచేస్తున్నవారికి కూడా బూస్టర్ డోస్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈసారి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా బూస్టర్ డోస్ తీసుకోవాలని బన్సెల్ సూచించారు. యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటర్ 18 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఫైజర్ / బయోఎంటెక్ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల వినియోగాన్ని ఆమోదించింది.

Read Also : Coronavirus Lockdown : లాక్ డౌన్ ల కాలం వచ్చేసింది..కరోనా ఫిఫ్త్ వేవ్ భయంతో ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్