Coronavirus Lockdown : లాక్ డౌన్ ల కాలం వచ్చేసింది..కరోనా ఫిఫ్త్ వేవ్ భయంతో ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్

ఆస్ట్రియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నాలుగో దశ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు శుక్రవారం ఆస్ట్రియా ప్రభుత్వం

Coronavirus Lockdown : లాక్ డౌన్ ల కాలం వచ్చేసింది..కరోనా ఫిఫ్త్ వేవ్ భయంతో ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్

Austria

Coronavirus Lockdown :  ఆస్ట్రియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నాలుగో దశ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు శుక్రవారం ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. తాజా ప్రకటనతో మరోసారి పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధించిన తొలి ఐరోపా దేశంగా ఆస్ట్రియా నిలిచింది.

సోమ‌వారం నుంచి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమ‌లులోకి రానుంది. పాఠశాలలు, రెస్టారెంట్లను మూసివేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. క‌నీసం ప‌ది రోజులైన సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంద‌ని ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ అలెగ్జాండ‌ర్ ష‌ల్క‌న్‌బ‌ర్గ్ తెలిపారు. కరోనా ‘ఫిఫ్త్ వేవ్’​ రాకుండా చూడాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు​. క‌రోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయ‌ని, మ‌రో వైపు వ్యాక్సినేష‌న్ త‌క్కువ స్థాయిలో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి దేశంలో వ్యాక్సినేషన్​ తప్పనిసరి చేస్తామని వెల్లడించారు.

కాగా, ఆస్ట్రియాలో ప్ర‌స్తుతం వ్యాక్సిన్ వేసుకోని వారికి లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. 12 ఏళ్ల కంటే ఎక్కువ ఉండి టీకా తీసుకోని వారు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గత ఏడు రోజులుగా ఆస్ట్రియాలో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజుకు 10వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ళఇక, ఆస్ట్రియా త‌ర‌హాలోనే ఇత‌ర యురోపియ‌న్ దేశాలు కూడా లాక్‌డౌన్ అమ‌లు చేసే ఆలోచ‌న‌లో ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకోని వారి కోసం స్లోవేకియా ప్ర‌ధాని ఇడార్డ్ హేగ‌ర్ కూడా సోమ‌వారం నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. టీకాలు తీసుకోని వారు ఉన్న ప్ర‌దేశాల్లో ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసేందుకు జ‌ర్మ‌నీ కూడా సిద్ధ‌మైంది.

ALSO READ Pawan Kalyan : చంద్రబాబు కంటతడి పెట్టడం బాధించింది, మహిళలను కించపరచొద్దు