First Covid Case : ప్రపంచంలో మొట్టమొదట కోవిడ్ సోకింది ఆమెకేనట!

చైనాలోని వుహాన్‌కు చెందిన ఒక అకౌంటెంట్ కి కోవిడ్-19 సోకిన మొదటి వ్యక్తి అని ఇప్పటివరకు అందరూ భావిస్తున్నారు. డిసెంబర్-16న మొట్టమొదటి కోవిడ్ కేసు రిపోర్ట్ చేయబడింది.

First Covid Case : ప్రపంచంలో మొట్టమొదట కోవిడ్ సోకింది ఆమెకేనట!

Wuhan (1)

First Covid Case :  చైనాలోని వుహాన్‌కు చెందిన ఒక అకౌంటెంట్ కి కోవిడ్-19 సోకిన మొదటి వ్యక్తి అని ఇప్పటివరకు అందరూ భావిస్తున్నారు. డిసెంబర్-16న మొట్టమొదటి కోవిడ్ కేసు రిపోర్ట్ చేయబడింది. అయితే వూహాన్ లోని హువానాన్ మార్కెట్ లో సీ ఫుడ్ విక్రయించే ఓ మహిళే మొట్టమొదటగా కోవిడ్ సోకిన వ్యక్తి అని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. డిసెంబర్11నే ఆమెలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయని తాజా అధ్యయనం చెబుతోంది.

జర్నల్ సైన్స్‌లో గురువారం వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం…డిసెంబరు 8,2019న దంతవైద్యం కారణంగా 41 ఏళ్ల వ్యక్తి అస్వస్థతకు గురికావడం వల్ల తలెత్తిన సమస్యల వల్ల అసలు ఎవరికి మొదట కరోనా సోకిందన్న ఈ గందరగోళం ఏర్పడింది. హువానాన్ మార్కెట్‌లోని పలువురు కార్మికుల్లో అప్పటికే ఇన్ఫెక్షన్ సంకేతాలు బయటపడ్డాయి. కరోనా వైరస్ కారణంగా జ్వరం మరియు ఇతర లక్షణాలు డిసెంబర్ 16న ప్రారంభమయ్యాయి( డిసెంబర్ 11న ప్రారంభమైన సీఫుడ్ విక్రేతతో సహా).

హువానాన్ మార్కెట్ నుండి 30 కిలోమీటర్లు దూరంలో నివసించే అకౌంటెంట్ కి… వుహాన్‌లో వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించిన తర్వాతనే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా అతడికి ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయంలో ఎకాలజీ మరియు ఎవల్యూషనరీ బయాలజీ హెడ్,తాజా అధ్యయన రచయిత మైఖేల్ వోరోబే చెప్పారు. వోరోబే తాజా పరిశోధన…”హువానాన్ మార్కెట్” వైరస్ ప్రారంభ వ్యాప్తికి మూలం అని సూచిస్తుంది.

మరోవైపు, కరోనా వైరస్ యొక్క మూలాన్ని శాస్త్రవేత్తలు ఇంకా గుర్తించలేదు. వైరస్ పుట్టుక గురించిన ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రయోగశాల నుంచి బయటపడిందా లేకా జంతువుల నుంచి వ్యాపించిందా అన్నది ఇంకా తేలలేదు.

ఉత్తర లావోస్ మరియు కంబోడియాలోని సున్నపురాయి గుహలలో నివసించే గబ్బిలాలతో వల్లనే కరోనా వ్యాపించిందనేది మరో వాదన. ముఖ్యంగా హువానాన్ సెంటర్‌తో సహా వుహాన్‌లోని మార్కెట్‌లలో ఇన్ఫెక్షన్‌కు గురయ్యే సజీవ జంతువులను విక్రయించారని,వైరస్ వ్యాప్తి ఇక్కడి నుంచే జరిగిందనేది మరో వాదన. హువానాన్ మార్కెట్‌లో లేదా వుహాన్‌లోని మరే ఇతర ప్రత్యక్ష-జంతువుల మార్కెట్‌లో సేకరించిన ప్రత్యక్ష క్షీరదాలు(పాలిచ్చే జంతువులు)కోవిడ్ సోకినట్లుగా గుర్తించబడలేదని, జనవరి 1న హువానాన్ మార్కెట్ మూసివేయబడిందని,డిసిన్ఫెక్షన్ చేయబడిందని వోరోబే చెప్పారు.

ALSO READ Lalu Prasad Yadav : సాగు చట్టాలు రద్దు చేసారు సరే..మరణించిన 700మంది రైతుకుటుంబాల సంగతేంటీ? : లాలూ ప్రసాద్