Punjab Pm Modi
Punjab Farmers : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను బహిష్కరించాలని రైతులు ప్లాన్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 14, 16, 17 తేదీల్లో పంజాబ్ లో పర్యటించేందుకు మోదీ రెడీ అవుతున్నారు. మాల్వా, దోబా, మాజా మూడు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 14న జలంధర్, ఫిబ్రవరి 16న పఠాన్ కోట్, ఫిబ్రవరి 17న అబోహర్ లో బహిరంగసభల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన్ను హెలికాప్టర్ లేదా విమానంలో సందర్శించాలని కాంగ్రెస్ ఎంపీ రవ్ నీత్ సింగ్ బిట్టు ఎద్దేవా చేశారు. రోడ్డు మార్గానా ప్రయాణించాలంటే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రజలు ఏడాది కాలంగా రోడ్లపై గడిచిన సంగతి మరిచిపోలేదని తెలిపారు. ఇటీవలే జరిగిన నిరసనల్లో 700 మందికి రైతులు చనిపోయారని బిట్టు పేర్కొన్నారు.
Read More : Dives Under Moving Train: కదులుతున్న రైలు కిందకు దూరి బాలికను కాపాడిన వ్యక్తి
ఇటీవలే ఫిరోజ్ పూర్ కు వెళుతుండగా కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పైన ఇరుక్కపోయిన సంగతి తెలిసిందే. భద్రతా లోపంపై సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. భద్రతలో పెద్దలోపంగా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిపై కేంద్రం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాయి. పంజాబ్ రిటైర్డ్ జస్టిస్ మెహతాబ్ సింగ్ గిల్, హోం సెక్రటరీ అనురాగ్ వర్మలతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీజీ అధికారులతో పాటు భద్రతా కార్యదర్శి నేతృత్వంలో కేంద్రం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం ఇప్పటికే విచారణ ప్రారంభించింది. మరి ప్రధాన మంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.
Read More : New York : వ్యాక్సిన్ వేసుకోని 3 వేల మున్సిపల్ సిబ్బందిపై చర్యలు!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికారం నిలుపుకోవాలని, మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. తాము గెలిచి తీరుతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం అంత సులువుగా కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో రైతులు కీలక పాత్ర పోషించారు. వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.