farmers protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం 33వ రోజుకు చేరుకుంది. చట్టాలు రద్దు చేసేవరకు తాము వెనక్కి తగ్గేదే లేదని రైతులు ఇప్పటికే సృష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్రం రెడీ అయింది.
బుధవారం(డిసెంబర్-30,2020) చర్చలకు రావాలని 40 రైతుసంఘాలకు సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ లేఖ రాసింది. న్యూ ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో బుధవారం మధ్యాహ్నాం 2గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాలకు రాసిన లేఖలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఓపైన్ మైండ్ తో ఇష్యూస్ ని పరిష్కరించేందుకు సిద్దమైనని కేంద్రం తన లేఖలో తెలిపింది. మరోవైపు మంగళవారం(డిసెంబర్-29,2020) ఉదయం 11 గం.కు చర్చలకు వస్తామని శనివారం కేంద్రానికి రైతు సంఘాలు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఇక రైతుల సంఘాల నేతలతో కేంద్రం ఇప్పటికే ఐదు సార్లు జరిపిన చర్చలు విఫలం అయిన విఫలం అయిన విషయం తెలిసిందే. కేంద్రంతో మరోసారి చర్చల నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి కూడా కేంద్రం తమ మాట వినకపోతే తమ తదుపరి అడుగు ‘ఫార్ములా 66’ అని హెచ్చరించారు. అంటే ఇప్పటికి రెట్టింపు రోజులు మా ఆందోళనని కొనసాగిస్తాం అని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికైత్ హెచ్చరించారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే.