Farmers protest Ends : ముగిసిన రైతు ఉద్యమం..378రోజుల తర్వాత తిరిగి ఇళ్లకు అన్నదాతలు

దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు

Farmers protest Ends :  దేశ రాజధాని సరిహద్దుల్లో ఏడాకిపైగా రైతులు చేస్తోన్న ఉద్యమం ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం…పంటలకు కనీస మద్దతు ధర(MSP)కు చట్టబద్దమైన హామీ,ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు మంగళవారం ఓ లేఖ పంపిన విషయం తెలిసిందే. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల సందర్భంగా.. మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌, హరియాణా ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్నీ లేఖలో ప్రస్తావించింది కేంద్రం.

రైతుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడంతో ఉద్యమాన్ని ముగించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)ప్రకటించింది. రైతుల పెండింగ్‌ సమస్యలపై కేంద్రం నుంచి ముసాయిదా ప్రతిపాదన అందడంతో ఈరోజు జరిగిన ఎస్‌కేఎం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యమం ముగిసినట్లు SKM ప్రకటించడంతో ఇళ్లకు తిరిగి వెళ్ళేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ- హర్యానా మధ్యలోని సింఘు సరిహద్దులో ఏడాదికి పైగా తాము ఉంటున్న టెంట్లను రైతులు తొలగిస్తున్నారు. అనేక ఢిల్లీ సరిహద్దు పాయింట్ల నుండి రైతులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తారని SKM తెలిపింది.

ఢిల్లీ సరిహద్దుల్లో 378 రోజుల పాటు రైతు ఉద్యమం సాగింది.

ALSO READ Rajnath Singh’s Statement : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

ట్రెండింగ్ వార్తలు