Farmers Oppose : ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కేంద్రం ఇంతవరకు కూడా రద్దు చేయలేదని రైతు సంఘాల నేతలు అన్నారు.

PM Modi’s visit to Punjab : ప్రధాని మోదీ (జనవరి5, 2022)న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనను అక్కడి రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని 8రైతు సంఘాల నేతలు ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని తెలిపాయి. రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను రైతు సంఘాల నేతలు దగ్ధం చేయనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కేంద్రం ఇంతవరకు కూడా రద్దు చేయలేదని రైతు సంఘాల నేతలు అన్నారు.

అలాగే ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదన్నారు. వీటన్నింటిపై హామీ ఇచ్చిన కేంద్రం ఇంతవరకు కూడా మాట నిలబెట్టకోలేదన్నారు. అందుకే ప్రధాని పర్యటనను వ్యతిరేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి5న ప్రధాని పర్యటన సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు తహసీల్‌, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Vaccination Children : నేటి నుంచి చిన్నారుల టీకా రిజిస్ట్రేషన్‌..ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్

ప్రధాని మోదీ ఈ నెల 5న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిరోజ్​పుర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన శాటిలైట్ సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు