Bihar Woman Marriage : తాగుబోతు భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య.. లోన్ రికవరీ ఏజెంట్‌తో పెళ్లి.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..!

Bihar Woman Marriage : తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన ఇంద్ర కుమారికి లోన్ రికవరీ ఏజెంట్‌ పవన్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. లోన్ చెల్లించాలంటూ పవన్ ప్రతిరోజూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఇరువరి మధ్య సంబంధం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.

Fed Up With Abusive Husband ( Image Source : Google )

Bihar Woman Marriage : తాగుబోతు భర్తకు దిమ్మతిరిగేలా ట్విస్ట్ ఇచ్చింది భార్య.. ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉంటే భర్తకు తాగింది మొత్తం దిగిపోయేలా షాకిచ్చింది. ఇంకా ఎంతకాలం ఈ నరకం అనుభవించాలి? దీనికి ఎలాగైనా ఎండ్ కార్డు పడాలని భావించింది. భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య చివరికి ఒక లోన్ రికవరీ ఏజెంట్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

Read Also :  PM Kisan : ఈ నెల 24న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. రూ. 2వేలు పడ్డాయో లేదో తెలుసుకోవడం ఎలా?

ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఒక మహిళ తన భర్తను వేధింపులను తట్టుకోలేక లోన్ రికవరీ ఏజెంట్‌ను పెళ్లాడింది. లోన్ చెల్లించమంటూ ఇంటికి వచ్చే ఇతగాడికి దగ్గరైంది. వీరిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారి ఆపై ప్రేమగా రూపుదాల్చింది. తాగుబోతు భర్తను వదిలించుకుని వీరిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అసలు స్టోరీ ఇలా మొదలైంది :
లోన్ రికవరీ కోసం తరచుగా తన ఇంటికి వచ్చే వ్యక్తితో ఈ మహిళ ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి వివాహం చుట్టుపక్కల ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లోని జాముయి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ తన భర్త వేధింపులు, దెబ్బలతో విసిగిపోయింది.

లోన్ రికవరీ కోసం తన ఇంటికి తరచుగా వచ్చే రికవరీ ఏజెంట్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రేమ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. ఇంద్ర కుమారి 2022 సంవత్సరంలో జముయి నివాసి అయిన నకుల్ శర్మను వివాహం చేసుకుంది. తాగుబోతు నకుల్ ఎప్పుడూ ఇంద్ర కుమారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. శారీరకంగా, మానసిక వేధింపులను తట్టుకోలేక, ఆమె అతడి బారి నుంచి చాలాసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

స్నేహం ప్రేమగా మారింది :
భర్త వేధింపులతో విసిగిపోయిన ఈమెకు ఒక ఫైనాన్స్ కంపెనీలో లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న పవన్ కుమార్ యాదవ్‌ కలిశాడు. లోన్ రికవరీ కోసం పవన్ తరచుగా ఆమె ఇంటికి వచ్చేవాడు. ఇలా వారిద్దరి మధ్య పరిచయడం ప్రారంభమైంది. కాలక్రమేణా వారి పరిచయం స్నేహంగా మారింది. ఆ తరువాత, స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

5 నెలలుగా రిలేషన్ బయటపెట్టలేదు :
ఇంద్ర, పవన్ తమ వివాహేతర సంబంధాన్ని దాదాపు 5 నెలల పాటు ఎవరికి తెలియకుండా దాచారు. ఆ తరువాత ఫిబ్రవరి 4న ఇంద్ర తన అత్త ఉండే పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌కు చేరుకున్నారు. వారిద్దరూ అక్కడ కొన్ని రోజులు ఉండి, తరువాత జముయికి తిరిగి వచ్చారు. ఆ తరువాత, ఫిబ్రవరి 11న వారిద్దరూ ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయాలతో జరిగిన ఈ వివాహానికి చాలా మంది హాజరయ్యారు.

Read Also : New Income Tax Bill : కొత్త ఆదాయ పన్ను బిల్లులో 10 ముఖ్యమైన మార్పులివే.. పన్నుచెల్లింపుదారులు తప్పక తెలుసుకోండి!

వైరల్ అవుతున్న పెళ్లి వీడియో :
వివాహం జరిగిన వెంటనే వారి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కుటుంబం ఈ వివాహాన్ని అంగీకరించింది. కానీ, ఇంద్ర కుటుంబం పెళ్లిని వ్యతిరేకించింది. ఇంద్ర కుటుంబం పవన్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

ఇంద్ర మాట్లాడుతూ.. తాను పవన్‌ను తన ఇష్టప్రకారం వివాహం చేసుకున్నానని చెప్పుకొచ్చింది. పవన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఇంద్ర కుటుంబం నుంచి బెదిరింపులు రావడంతో, నూతన వధూవరులు అధికారుల నుంచి రక్షణ కోరుతున్నారు. ఇంద్ర బంధువులు ప్రతీకారం తీర్చుకుంటారని, సామాజికంగా వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారు.